దర్శకుడితో రొమాన్స్‌కు సిద్ధమంటున్న ఆండ్రియా..!

కమల్ విశ్వరూపం.. తడాఖాలో సునీల్ సరసన నటించిన ఆండ్రియా గుర్తుందా.. ఈ పొడుగు భామ ఇటీవలే తెలుగు ప్రేక్షకులను చంద్రకళతో పలకరించింది. ఇప్పుడు ఆమె ప్రముఖ దర్శకుడు ఎస్‌జే.సూర్యతో కలిసి ఓ సినిమాలో రొమాన్స్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇశై చిత్ర నిర్మాణానికి సుదీర్ఘ సమయం తీసుకున్న సూర్య ఆ సినిమాను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆడియో కూడా విడుదలైంది. ఆ వెంటనే సూర్య కార్తీక్ సుబ్బురాజ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడు. ఆయన గతంలో పిజ్జా, విల్లా సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఆండ్రియా ఎంపికైంది. నిర్మాత సీవీ రవికుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇతర సాంకేతిక నిపుణులు, నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమా మిగిలిన వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.