మందుతాగి బూతులతో హీరోయిన్ అంజలి వీరంగం..!

టాలీవుడ్, కోలీవుడ్‌లో మంచి హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అంజలి ఇటీవల సినిమాల కంటే వివాదాల్లోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్‌తో ఘర్షణ పడి వార్తల్లోకి వచ్చిన అంజలి తర్వాత కొద్ది రోజుల మాయమైంది. రీసెంట్‌గా అంజలి బంజారాహిల్స్‌లోని తబలా పబ్‌లో మందేసి.. చిందేసి పబ్‌లో బండ బూతులు తిట్టిందట. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అంజలి పబ్‌లో తన స్నేహితులతో కలిసి మద్యం సేవించింది. అనంతరం ఆమె డ్యాన్స్ చేసేందుకు వెళుతుండగా పబ్‌లో ఉన్న బాయ్ ఒకరు ఆమెను అడ్డగించారట. దీంతో అంజలికి చిర్రెత్తుకొచ్చి ఆ బాయ్‌ను నానా బూతులు తిట్టిందట. అక్కడకు వచ్చిన నిర్వాహకులను కూడా బూతులు తిట్టడంతో అవాక్కైన వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వివాదాన్ని సద్దుమణిగేలా చేశారని సమాచారం. ఏదేమైనా టాలెంట్ ద్వారా వార్తల్లో వెలుగు వెలగాల్సిన ఆమె ఇలా వార్తల్లోకి ఎక్కడం బాధాకరం. అయితే ఆమె ఈ తప్పుచేయకపోతే బయటకు వచ్చి స్వయంగా వివరణ ఇచ్చుకోవాలి.