పీకే హిట్‌తో హ్యాపీ.. కోపంగా కోహ్లి… లవర్ కోసం ఆస్ట్రేలియాకు అనుష్క

పీకే హిట్‌తో మంచి హ్యాపీగా ఉన్న బాలీవుడ్ నటి అనుష్కశర్మ నూతన సంవత్సర వేడుకలు ఆస్ట్రేలియాలో తన ప్రియుడు విరాట్‌కోహ్లీతో జరుపుకునేందుకు ఆమె పయనమవుతోంది. బాలీవుడ్ మిస్టర్ ఫర్‌పెక్ట్ అమీర్‌ఖాన్‌తో అనుష్క నటించిన పీకే సూపర్‌హిట్ కావడంతో అనుష్క పేరు మార్మోగిపోతోంది. ఈ చిత్రం విజయంతో పాటు న్యూఇయర్ వేడుకలను కోహ్లితో జరుపుకోనుంది. అయితే కొద్ది రోజుల క్రితం అనుష్కశర్మ ఓ మేగజైన్‌కు హాట్‌గా పోజు లివ్వడంతో కోహ్లి అసహనం వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ ఆమె ప్రియుడు శాంతించడంతో ఆమె ఆసీస్‌కు పయనమవుతోంది.