అనుష్క అమెరికా వెళ్లింది అందుకేనా….

బొమ్మాళి అనుష్క ఫుల్ బిజీగా ఉంది. ఓ వైపు అనుష్క ప్రధాన పాత్రలో నటించిన రుద్రమదేవి అక్టోబర్ 9న విడుదలౌతోంది. ఆ సినిమా ప్రమోషన్ కోసం రెడీ అవుతోంది. దీంతో పాటు ప్రకాష్ కోవెలమూడి రూపొందించిన సైజ్ జీరో చిత్రం పూర్తి చేసే పనిలో ఉంది. అయితే ఈ సినిమా కోసం బాగా ఒళ్లు చేసింది. లావుగా ఉన్న అమ్మాయి సన్నబడటమే ఈ చిత్ర కాన్సెప్ట్. దీనికోసం స్వతహాగా ఆనుష్క లావెక్కింది. ఇప్పుడు పెంచిన, పెరిగిన కొవ్వును కరిగించే పనిలో ఉంది. దీనికోసం అమెరికా వెళ్లింది. అక్కడి వైద్యుల, నిపుణుల పర్యవేక్షణలో కొవ్వును కరిగించనుందట.

అనుష్క సన్నబడటానికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది. అనుష్క మరి కొద్ది రోజుల్లోనే బాహుబలి 2 చిత్ర షూటింగ్ లో పాల్గొనబోతోంది. అందులో అనుష్క గ్లామరస్ గా కనిపించాలి. ఈ చిత్రంలో అనుష్కదే కీలక పాత్ర. అందుకే నాజూకుగా తయరయ్యేందుకు అమెరికా వెళ్లిందట.