బీజేపీలోకి మాజీ సీఎం కిరణ్.. చేరిక వెనక ఉన్న ట్విస్ట్ ఇదేనా..!

మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీ గూటికి చేరనున్నారు. ఈ నెల 29న విజయవాడలో జరిగే కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని సమాచారం. సమైక్యాంధ్రప్రదేశ్‌కు మూడున్నరేళ్ల పాటు సీఎంగా ఉన్న ఆయన రాష్ట్ర విభజన నిరసిస్తూ గత ఎన్నికలకు ముందు జైసమైక్యాంధ్ర పార్టీ స్థాపించారు. అయితే ఆ పార్టీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. ఆయన సొంత నియోజకవర్గమైన పీలేరులో మాత్రం డిపాజిట్ దక్కించుకుని రెండో స్థానంలో నిలిచింది. ఇటీవల కాలంలో పాలిటిక్స్‌లో పెద్దగా కనిపించని కిరణ్ ఇప్పుడు మరోసారి తెరమీదకు వస్తున్నారు. 

అయితే ఆయన బీజేపీలో చేరేందుకు షరతులేమి లేకుండానే ఆయన్ను పార్టీలోకి చేర్చుకునేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం చిన్న మెలిక పెట్టిందని సమాచారం. ఆయనకు రాజ్యసభ లేదా మరే ఇతర పదవి ఇచ్చే ఒప్పందాలేమి లేకుండా పార్టీలోకి తీసుకునేలా బీజేపీ జాతీయ నాయకత్వం అంగీకారం తెలిపినట్టు టాక్. అయితే కిరణ్ బీజేపీలో చేరేందుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి ద్వారా కాస్త లాబీయింగ్ నడిపినట్టు తెలుస్తోంది.