అర్జున్ రెడ్డి రివ్యూ – డామ్ ఫక్కింగ్…. బోల్డ్ కంటెంట్

కొత్తోడు సినిమా తీస్తే… ఇట్ల బజ్ తెచ్చుకోవాల్ర బై అన్నట్టు… క్రేజ్ సంపాదించిండు డైరెక్టర్ సందీప్ రెడ్డి. ఓర్నీయమ్మ… ఎందా క్రేజ్…. కాలేజ్ పోరగాళ్లయితే పూనకాలు ఊగిండ్రు. అరే మూతి ముద్దులెక్కువున్నయ్ వద్దు అన్నా… కాలేజ్ పోరీలు సైతం… టిక్కెట్లకు ఎగబడ్డరు. ఏదైనా… డైరెక్టర్ మాత్రం టీజర్లు, ట్రైలర్స్ తోటి సినిమాకు బజ్ తెస్తే.. గా.. విజయ్ ఆడియో ఫంక్షన్లో… మాట్లాడితే ఫక్ అని… ఇంకాస్త ఆజ్యం పోసిండు. ఇవన్ని ఇట్లుంటే… బస్సుల మీద ముద్దుల పోస్టర్స్ సెన్సేషన్ ఐనయ్. దీంతో సూపర్ బజ్ మీద రిలీజ్ అయ్యింది అర్జున్ రెడ్డి. మరి డైరెక్టర్ హీరో చాలా ఓవర్ చేస్తుండ్రురా బై అనే విమర్శల మధ్య వచ్చి నఅ అర్జున్ రెడ్డి ఎట్లుందో సూద్దాం….

కథ సింపుల్ గుంటది. హీరో విజయ్ పేరు అర్జున్ రెడ్డి. మెడిసిన్ సదువుతుంటడు. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటడు. కోపమొస్తే మాత్రం ఎవడైనా సరే ఊరుకునేది. లేదు. అనుకుంటే చేయాల్సిందే. అదే మనోడి నైజం. కాలేజ్ లో లెక్చరర్స్ కూడా భయపడాల్సిందే. సెక్స్ పిచ్చోడు. మందు తాగితే మనిషి కాదు. ఇన్ని ఉన్నా… మనోడు కాలేజ్ ల మాత్రం టాపర్. సూపర్ డాక్టర్. అయితే కోపమే మనోడి ప్లస్, మైనస్. కాలేజ్ ల జూనియర్ మెడికల్ పిల్ల ప్రతీ శెట్టి (షాలిని)ని చూసి ప్రేమిస్తడు. ఆ పిల్లంటే పడిసస్తడు. ఆ పిల్ల కూడా మనోడంటే పడిసస్తది. అట్ల ఇద్దరూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటరు. ఎట్లంటే కలిస్తే మూతి ముద్దులు. ఓ దశ నుంచి ముద్దులు హద్దులు దాటుతయ్… సెక్స్ కూడా సేస్తరు. అంతగా ఇన్ వాల్వ్ అయినా… వాళ్ల పెళ్లి మాత్రం కాదు. హీరోయిన్ నాన్న వీళ్ల పెళ్లికి ఒప్పుకోడు. హీరోయిన్ కు వెరే అబ్బాయ్ తో పెళ్లి చేస్తరు. దీంతో హీరో పిచ్చోడైతడు. ప్రతీ ప్రతీ అంటూ కలవరిస్తూ… రోజు తాగుతుంటడు. డ్రగ్స్ కి బానిస ఐతడు. డాక్టర్ గ మంచి జీతం వస్తుంది. కానీ… తాగి ఆపరేషన్ చేసిండని లైసన్స్ పోతది. ఇట్లున్న టైంలో ప్రెగ్నెంట్ గా ఉన్న హీరోయిన్ కనిపస్తది. అప్పుడు హీరో రియాక్షన్ ఏంటనేది అసలు కథ. ఇంతకు డైరెక్టర్ సర్ క్లోజింగ్ ఎట్ల చేసిండనేది మాత్రం థియేటర్లనే సూడాలి.  

హీరో విజయ్ దేవర కొండ చింపేసిండనే చెప్పాలి. క్యారెక్టర్ కు సరిగ్గ సరిపోయిండు. బెస్ట్ పెర్ ఫార్మెన్స్ తో చింపిపైయింగ్. విజయ్ తప్ప మరెవ్వరూ సేయలేడ్రబై అంటరు ఎవ్వరైన. గెడ్డంల హాలీవుడ్ హీరోల కనిపించిండు. హీరోయిన్ సైతం బాగా ప్లస్ అయ్యింది. ముద్దు ముచ్చట్ల సీన్స్ లోనూ ఇరగదీసిండ్రు, కెమిస్ట్రీ ఫిజిక్స్ అన్నీ వర్కవుట్ అయినయ్. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఆర్టిస్టుకు సైతం మస్తు పేరొస్తది.  

డైరెక్టర్ సందీప్ రెడ్డి… హీరో క్యారెక్టర్ ను బాగా రాసిండు. లవ్ ఫెయిల్యూర్ ని భావోద్వేగాల్ని మూతి ముద్దుల్ని, హీరోయిన్ క్యారెక్టర్ ను, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ని, కాలేజ్ డేస్ ని, పేరెంట్స్ ఆటిట్యూడ్స్ ని, కాస్ట్ ఫీలింగ్స్ ని, నాయనమ్మ మోటివేషనల్ స్పీచుల్ని,,,, ఇలా ప్రతీ క్యారెక్టర్ ని, సీన్ ని బాగా రాసిండు. ఆడోళ్ల గురించి హీరో చేత డైరెక్టర్ క్లాప్స్ కొట్టించే డైలాగ్స్ చెప్పించిండు. దానికి హాట్సాఫ్ చెప్పాలి.  ఎటొచ్చి కొద్దిగా లెంగ్త్ తగ్గిస్తే బాగుండేది. పనికిరాని సీన్స్ కొన్ని పడ్డయ్. సినిమా ఓవరాల్ గ బాగుంది. కానీ సెకండాఫ్ ని ట్రిమ్ చేస్తే.. పర్ ఫెక్ట్ కల్ట్, బోల్డ్, యూత్ ఫుల్ లవ్ స్టోరీగా మిగిలి పోయేది. అంటే హీరో క్యారెక్టర్ బ్యాడ్ గా ఉన్నా… బాగా నచ్చుతుంటాడు. కానీ సెకండాఫ్ కి వచ్చే సరికి అతి ప్రవర్తన చాలా సేపు సూపించే సరికి బోర్ కొట్టింది. 

రియలిస్టిక్ క్యారెక్టర్స్, పెర్ ఫార్మెన్స్, డైరెక్షన్ సినిమాను నిలబెట్టింది. మెయిన్ గ డైలాగ్స్ బాగా రాసిండు. దీంతో చాలా సీన్స్ బాగా ఎంజాయ్ చేస్తం. ఓవరాల్ గా అర్జున్ రెడ్డి యూత్ కి కిక్కిచ్చే సినిమా. 

PB Rating : 3/5