విక్రమ్, శంకర్ మనోహరుడికి ఆర్నాల్డ్ గెస్ట్

శంకర్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చిత్రం మనోహరుడు. ఈ చిత్రంలో విక్రమ్ నటన అద్భుతంగా ఉంటుందని అతని గెటప్స్ చూసి షాక్ అవుతారని చిత్ర బృందం చెబుతోంది. అయితే ఈ చిత్ర ఆడియోను కూడా అంతే గ్రాండ్ గా చేయాలని నిర్ణయించారు చిత్ర నిర్మాతలు అందుకే మనోహరుడు ఆడియో లాంచ్ కోసం హాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు ఆర్నాల్డ్ స్క్వాజ్ నిగర్ ను గెస్ట్ గా తీసుకురానున్నారట. మనోహరుడు ఆడియోకు ఆర్నాల్డ్ రానున్నాడని తమిళ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. తమిళంలో ఈ చిత్రాన్ని ఐ పేరుతో విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ చివరి వారంలో ఈ చిత్ర ఆడియో విడుదలయ్యే అవకాశముంది. ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతమందించారు. అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. శంకర్ గానీ, ఆర్నాల్డ్ గానీ ఈ విషయాన్ని ధృవీకరించలేదు. 

ఆమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది. పి.సీ.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుందట. జూలై తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.