“అసెంబ్లీ రౌడీ” ఛాయలు మచ్చు కు కుడా లేవు….

ర‌మా రీల్స్ బ్యాన‌ర్‌పై జాన్‌సుధీర్ పూదోట నిర్మించిన సినిమా ఓటర్ . మంచు విష్ణు, సురభి హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాను జి .ఎస్ కార్తీక్ రెడ్డి దర్శకత్వం వహించారు . తమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది . పోసాని కృష్ణ మురళి నటన ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది . ప్రధానంగా రీ కాల్ అనే కాన్సెప్ట్ సినిమాకు మెయిన్ హైలెట్ అని చెప్పుకోవాలి .

“అసెంబ్లీ రౌడీ” సినిమాలోని సీన్లు, స్క్రీన్ ప్లే వాడుకున్నారు అంటూ ఈ మధ్య “ఓటర్” చిత్ర వివాదం మీడియాలో కాస్త హల్ చల్ చేసింది. అయితే నిజానికి “ఓటర్” లో ఆ ఛాయలు మచ్చుకైనా కనపడలేదు. స్క్రీన్ ప్లే వరకూ ఎందుకు.. కనీసం ఒక్క సీన్ లో కూడా “అసెంబ్లీ రౌడీ” పోలికలు కానరాలేదు. మరి ఏమి లేని దానికి ఇంత వివాదం ఎందుకు రేగిందో ఆ చిత్ర వర్గాలకే తెలియాలి. చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంది . దర్శకుడు జి .ఎస్ . కార్తీక్ రెడ్డి సినిమాను చిత్రీకరించిన విధానం బాగుంది .