భారత్‌కు జైత్రయాత్రకు ఆసీస్ బ్రేక్… కప్ ఆసీస్‌దా..కీవీస్‌దా..!

ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ఒత్తిడిని జయించలేకపోయారు. ఆసీస్ ఫేస్‌కు భారత్ దాసోహమైంది. సిడ్నీలో జరిగిన సెమీఫైనల్లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. స్టివెన్ స్మిత్(105), ఫించ్ (81) రాణించడంతో ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో ఉమేష్‌యాదవ్ 4 వికెట్లు తీశాడు.

అనంతరం 329 పరుగుల భారీ విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఒత్తిడి జయించలేకపోయింది. తొలి వికెట్‌కు శిఖర్‌ధావన్, రోహిత్‌శర్మ 76 పరుగులు జోడించడంతో భారత్‌దే విజయం అన్న నమ్మకం కలిగింది. అయితే తర్వాత వరుసగా 4 వికెట్లు కోల్పోయింది. 

కోహ్లీ 1 పరుగుకే అవుట్ అయ్యాడు. ధావన్ 45, రోహిత్ 34, రైనా 7 పరుగులు చేశారు. తర్వాత రహానే, ధోనీ బాగా ఆడి జట్టును ఆదుకున్నారు. 178 పరుగుల వద్ద రహానే అవుటయ్యాడు. తర్వాత జడేజా 16 కూడా అవుట్ కావడంతో ధోనీ ఒంటరి పోరాటం చేసినా అప్పటికే ఆలస్యమైంది. ధోనీ 65 పరుగులు చేసి రన్అవుట్ అయ్యాడు. 

ఆస్ట్రేలియా బౌలర్లలో పాల్కనర్ 3, జాన్సన్ 2, స్టార్క్ 2 వికెట్లు తీశారు. సెంచరీతో జట్టును గెలిపించిన స్మిత్‌కు మ్యాన్ఆఫ్‌ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆదివారం జరిగే ఫైనల్లో రెండు ఆధిత్య జట్లు అయిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఫైనల్లో తలపడతాయి. ఫైనల్లో కప్ ఎవరు గెలిచినా ఆధిత్య జట్లే చాంఫియన్ అయినట్లవుతుంది. ఆసీస్, కీవీస్‌లలో కప్ ఎవరిదో ఆదివారం తేలనుంది.