ఆసీస్‌దే ట్రై సీరీస్ …ఫైనల్లో ఇంగ్లండ్ చిత్తు చిత్తు

ఆస్ట్రేలియాలో జరిగిన ట్రై సీరీస్ ఆథిత్య ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత ఆస్ట్రేలియాకు బ్యాటింగ్ అప్పగించింది. ఆస్ట్రేలియా 60 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. మ్యాక్స్‌వెల్ 95, ముల్లర్ 24 బంతుల్లో 50 పరుగులు చేయడంతో ఆసీస్ 278 పరుగులు చేసింది. అనంతరం 279 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ కూడా 60 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. 39.1 ఓవర్లలో 166 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో బొపారా(33), మెయిన్ ఆలీ(26), రూట్(25), బ్రాడ్(24) పరుగులు మాత్రమే చేశారు. ఆసీస్ బౌలర్లలో మ్యాక్స్‌వెల్ నాలుగు, జాన్సన్ మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. 

ఇక ఆసీస్ ట్రై సీరీస్ సాధించి వరల్డ్‌కప్‌కు ముందు మానసికంగా సిద్ధమైంది. ఇదే పిచ్‌లపై ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగుతుండడం ఆ జట్టుకు బాగా కలిసివస్తోంది.