బాహుబలి 2ను షేర్ల లెక్కన అమ్మేస్తున్నాడు…స్ట్రాటజీకి సలామ్

బాహుబ‌లి తెలుగు సినిమా లెక్క‌ల్ని ఏ స్థాయిలో మార్చేసిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ సినిమా పుణ్య‌మా అని ఇప్పుడు అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ తెలుగు సినిమాకు మార్కెట్ పెరిగింది. ముందు అంద‌రూ బాహుబ‌లి హిట్ట‌వుతుంది.. 200 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేస్తుందిలే అనుకున్నారు. కానీ అంద‌రి ఊహల్ని త‌ల‌కిందులు చేస్తూ ఏకంగా 500 కోట్ల‌కు పైగా కొల్ల‌గొట్టింది బాహుబ‌లి. తొలి భాగాన్ని కొన్న వాళ్ళంతా డ‌బుల్ లాభాల‌తో పండ‌గ చేసుకున్నారు. దాంతో రాజ‌మౌళి బుర్ర‌కు అద్భుత‌మైన ఆలోచ‌న త‌ట్టిందిపుడు. బాహుబ‌లి 2ని షేర్స్ లెక్క‌న అమ్మేస్తున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు.

ఇప్ప‌టికే క‌ర్ణాట‌క రైట్స్ ను సాయికొర్ర‌పాటికి భారీ రేట్ కు అమ్మేసిన రాజ‌మౌళి.. మిగిలిన భాగాన్ని కూడా షేర్స్ రూపంలో అమ్మేయ డానికి చూస్తున్నాడు. ఇలా చేస్తే.. రైట్స్ రూపంలో కంటే డ‌బుల్, ట్రిపుల్ లాభాలు నిర్మాత‌ల జేబుల్లోకి వెళ్తాయి. ఇప్ప‌టికే బాహుబ‌లి భారీ హిట్ కావ‌డంతో.. ఆ క్రేజ్ తో బాహుబ‌లి 2 ని ఎంతైనా ఇచ్చి కొన‌డానికి కార్పోరేట్ కంపెనీలు సిద్దంగా ఉన్నాయి. ఈ క్రేజ్ నే త‌న సినిమాకు ఆయుధంగా వాడేసుకుంటున్నాడు రాజ‌మౌళి. రైట్స్ కాకుండా.. మ‌న సెన్సెక్స్ రూపంలో షేర్స్ అమ్మేస్తున్నాడు. దీనికోసం రైట్స్ కంటే భారీ రేట్ పెట్టి కొనేందుకు కార్పోరేట్ కంపెనీలు పోటీ ప‌డుతున్నాయి. ఇదే జ‌రిగితే.. మునుముందు రాజ‌మౌళి తీయ‌బోయే సినిమాల‌కు కూడా నిర్మాత‌లు అవ‌స‌రం లేదు. ద‌ర్శ‌క‌ధీరుడు సినిమా అనౌన్స్ చేయ‌గానే.. కంపెనీలు ముందుకొచ్చి ఎన్ని కోట్లైనా పెట్టి షేర్ కొన‌డానికి సిద్ధ‌మైపోతారు. విన‌డానికే ఎంతో అద్భుతంగా ఉన్న ఈ ప్లాన్ నిజంగా వ‌ర్క‌వుట్ అయితే గ‌న‌క తెలుగు సినిమా ముఖ‌చిత్ర‌మే మారిపోవ‌డం ఖాయం.