బాహుబలి 2 మూవీ రివ్యూ

ముసుగులో గుద్దులాటలు లేకుండా డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తా… బాహుబలి 2 ఎలా ఉంది అనే ప్రశ్నకు సమాధానం… బ్లాక్ బస్టర్ అనే పదం సరిపోదు. ఈ సినిమాను ఎంత పొగిడినా తక్కువే. ఎందుకంటే ఆ తమిళమోళ్లు, ఆ బాలీవుడోళ్లు, ఆ ఆస్కారోళ్లకు మన తెలుగోళ్లంటే చులకన… మన తెలుగు సినిమాల్ని తక్కువ చేసి మాట్లాడుతారు… నిజానికి బాహుబలి 1 బానే ఉంది అని ముక్తసరిగా చెబితేనే… అత్యధిక వసూళ్లు సాధించి పక్క రాష్టాలోళ్లు ముక్కున వేలసుకున్నారు. కొన్ని డిస్ట్రిబ్యూటర్లంతా కోట్లలో కొల్లగొట్టారు. అందుకే రాజమౌళి ఈసారి… ఎవ్వడూ కామెంట్ చేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆర్టిస్టుల పెర్ ఫార్మెన్స్, గ్రాఫిక్స్, కెమెరా వర్క్ యాక్షన్ పార్ట్, కాస్ట్యూమ్స్ ఇలా ప్రతీ డిపార్ట్ మెంట్ పోటీపడి మరి పనిచేశారని తెలుస్తోంది. ఎంత కష్టపడ్డా ప్రతీ సినిమాకు ఉన్నట్టే… ఈసినిమాలో కూడా ప్రథమార్థంలో ఓ అరగంట పాటు బోర్ కొట్టించారు. ఇలాంటి చిన్న చిన్న నెగెటివ్స్ పక్కన పెడితే… క్లైమాక్స్ సినిమాకు హైలైట్ గా ఉంటుంది. రానా, ప్రభాస్ ఫైట్ ని బాగా కంపోజ్ చేశారు. కట్టప్ప గా నటించిన సత్యరాజ్ నటన అద్భుతమనే చెప్పాలి.

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే దాని కోసం చాలా మంది ఈ సినిమా చూస్తారు. సంక్షిప్తంగా చెప్పుకుంటే… భళ్లాలదేవ బాహుబలిని అంతమొందించాలని అనుకుంటాడు. తల్లి శివగామికి బాహుబలి గురించి చెడుగా ప్రచారం చేస్తాడు. దీంతో భల్లా మాటల్ని నమ్మి బాహుబలిని చంపమని కట్టప్పను ఆదేశిస్తుంది. అయితే ఇలా మాటల్లో చెబితే అంత కిక్ ఉండదు. దీని వెనక పెద్ద మంత్రాంగమే నడుస్తుంది. ఆ సన్నివేశాలన్నీ ఆసక్తికరంగా ఉంటాయి. ఈ సన్నివేశాలు ఇంత బాగున్నాయంటే మరో ముఖ్య కారణం కీరవాణి రీ రికార్డింగ్.. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సినిమా చూసినట్టుగా అనిపిస్తుంది.

ఫైనల్ గా మరో బ్లాక్ బస్టర్ సినిమా అందించాడు బాహుబలి రాజమౌళి… గో అండ్ మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్

PB Rating : 4/5