బాహుబలి లేటెస్ట్ మేకింగ్ వీడియో.. అదో సరికొత్త ప్రపంచం

ఎస్ఎస్.రాజమౌళి భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం బాహుబలి కి సంబంధించి కొత్త మేకింగ్ వీడియోను సోమవారం ఆవిష్కరించారు. ఈ వీడియోలో హీరోహీరోయిన్లతో పాటు సినిమాలో నటిస్తున్న నటులు ఎవ్వరు కనిపించరు. అయితే సెట్స్‌ను డిజైన్ చేయడం ఇందులో చూపించారు. ఆ సెట్స్ చూస్తుంటే ఓ సరికొత్త ప్రపంచంలోకి ఎంటర్ అయినట్టు కనిపిస్తోంది. ఆదివారం ఈ వీడియోను ముంబైలో జరిగిన కామిక్‌కాన్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. రానాతో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజా వీడియోతో జక్కన్న మరోసారి బాహుబలిపై అంచనాలను హైప్ చేశాడు.