బైలం పూడి మూవీ రివ్యూ

బైలంపూడి అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఈ మధ్య సినిమా రాలేదు. ఈ చిత్రం ట్రైలర్ చూసిన వారు సినిమా ఎప్పుడు చూద్దామా అనే క్యూరియాసిటీ చూపించారు. విభిన్నమైన కథ, కథనంతో ఈ సినిమా తెరకెక్కించారు. మంచిఅంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. హరీష్ వినయ్ , బ్రహ్మానంద రెడ్డి , తనిష్క్ రాజన్ ఇందులో ముఖ్యభూమిక పోషించారు. బ్రహ్మానంద రెడ్డి నిర్మాత. అనిల్ పిజి రాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథేంటంటే…..

బైలం పూడి అనే గ్రామంలో తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆటో నడుపుకుంటూ అమ్మకు తోడుగా ఉంటాడు రవి ( హరీష్ వినయ్ ). అదే గ్రామంలో గ్రామపెద్ద అయిన గురు నారాయణ్ ( బ్రహ్మానందరెడ్డి ) అంటే అందరికి గౌరవం , భయం కూడా . కానీ అలాంటి గురు నారాయణ్ ని ఎదిరించి నిలబడిన రవి ని చూసి ఇష్టపడుతుంది కళ్యాణి (తనిష్క్ రాజన్ ) . రవి – కళ్యాణి ల ప్రేమకు అడ్డుగా నిలుస్తాడు గురు నారాయణ్ . దాంతో గురు నారాయణ్ ని చంపేస్తాడు రవి . కానీ గురు నారాయణ్ చనిపోయే ముందు కళ్యాణి గురించి నమ్మశక్యం కానీ నిజం చెప్పి చస్తాడు ? అసలు గురు నారాయణ్ చెప్పిన నిజం ఏంటి ? కళ్యాణి ఏం చేసింది ? కళ్యాణి గురించి తెలిసిన రవి ఏం చేసాడు ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

సమీక్ష
ఈ తరహా కథ, కథనం తమిళ చిత్రాల్లో చూసి అద్భుతం అని అంటారు. అలాంటి కంటెంట్ తో తెరకెక్కిందే బైలం పూడి. దర్శకుడు అనిల్ మంచి సెటప్ చేశాడనిపించింది. గంజాయి సమస్య ని ఎంచుకొని దాని చుట్టూ ఓ కథని అల్లుకొని మంచి ప్రయత్నమే చేసాడు అనిల్ . మన్మధ సాయి అందించిన డైలాగ్స్ బాగున్నాయి. ఈ తరహా కథలుతెరకెక్కించాలంటే మంచి క్లారిటీ ఉండాలి. స్వతహాగా కెమెరామెన్ కావడం కూడా బాగా కలిసొచ్చింది. తన డైరెక్షన్ తో తన కెమెరా వర్క్ తో మంచి సినిమా అందించాడు. ఎమోషన్స్ ని బాగా పండించాడు. ముఖ్యంగా విలన్ క్యారెక్టరైజేషన్ ను తీర్చిదిద్దిన విధానం బాగుంది. బ్రహ్మానంద రెడ్డి విలన్ గా భయపెట్టగలిగాడు. తన క్యారెక్టర్ కు పూర్తి న్యాయం చేయగలిగాడు. హీరోగా నటించిన హరీష్ వినయ్ బాగా నటించాడు . డ్యాన్స్ లతో పాటుగా ఫైట్స్ లలో కూడా రాణించాడు. తనిష్క్ రాజన్ ఆల్రెడీ పలు చిత్రాల్లో నటించింది , ఈ సినిమాలో కూడా మరోసారి అలరించే ప్రయత్నం చేసింది . ఇక హీరో ఫ్రెండ్స్ గా నటించిన నటరాజ్ , నత్తి నరి హాస్యంతో మెప్పించారు , అలాగే ఎమోషనల్ సీన్స్ లో కూడ అదరగొట్టారు.

టెక్నికల్ గా ఈ సినిమా క్వాలిటీగా ఉంది. కెమెరా వర్క్ కూడా దర్శకుడే చేశాడు కాబట్టి సీన్స్ మీద మంచి పట్టు ఉంది కాబట్టి అద్భుతంగా వచ్చాయి. ఈ తరహా చిన్న సినిమాలకు సినిమాటోగ్రఫీ చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో అనిల్ సక్సెస్ అయినట్టే. ఇక పాటలు కూడా చాలా బాగున్నాయి. సుభాష్ ఆనంద్ అందించిన పాటలు బాగా కుదిరాయి. వీటికి పిక్చరైజేషన్ కూడా బాగుంది. రీరికార్డింగ్ తో చాలా సన్ని వేశాల్ని హైలైట్ చేయగలిగాడు.

ఫైనల్ గా… రియలిస్టిక్ సీన్స్, నటీనటుల పెర్ ఫార్మెన్స్, దర్శకుడు కథ నడిపించిన తీరు, కథనం కెమెరా వర్క్, మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలిచి ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తాయి. నిర్మాణాత్మక విలువలు చాలా బాగున్నాయి. సో క్వాలిటీ సినిమాని ఎంజాయ్ చేయ్యెచ్చు.

PB Rting : 3/5