డిక్టేటర్ గా బాలయ్య బాబు అదరగొట్టారు…ఫస్ట్ లుక్ పీక్స్

బాలయ్య బాబు సినిమా అంటేనే అంచనాలు బారీగా ఉంటాయి. అలాంటిది ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిందంటే చాలా ఆ అంచనాల్ని లెక్క కట్టలేం. ఇప్పుడు బాలయ్య అభిమానులు పండగ చేసుకునే టైం వచ్చింది. డిక్టేటర్ చిత్ర ఫస్ట్ లుక్ వచ్చేసింది. వినాయక చవితి కానుకగా బాలయ్య అభిమానులకు అందించిన ఈ పోస్టర్ కు రెస్పాన్స్ సూపర్ గా ఉంది.

ఈరోస్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ లో వేదాశ్వ క్రియేషన్స్ అసోసియేషన్ తో డిక్టేటర్ చిత్రం రూపొందుతోంది. లౌక్యం వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అందించిన శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ రచయితలు కోనవెంటక్, గోపిమోహన్ లు ఈ చిత్రానికి రచయితలుగా వర్క్ చేస్తున్నారు. శ్రీమంతుడు సక్సెస్ తర్వాత ఈరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో రూపొందుతోన్న మరో చిత్రమిది. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో కూడా ఈరోస్ ఇంటర్నేషనల్ సినిమాలు చేయడానికి రెడీ అవుతుంది.

పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ‘డిక్టేటర్’ లో అన్నీ రకాల ఎమోషన్స్ సహా అన్నీ ఎలిమెంట్స్ తో బాలకృష్ణ అభిమానులను అలరించేలా ఉంటుంది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చే చిత్రమవుతుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా స్టయిలిష్ లుక్ తో కనపడుతారు. ఈ సినిమాని హైదరాబాద్, ఢిల్లీ సహా యూరప్ లో చిత్రీకరిస్తునారు.

నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతోన్న 99వ చిత్రం డిక్టేటర్. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో అంజలి, సోనాల్ చౌహాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రవికిషన్, షాయాజీ షిండే, నాజర్, పృథ్వి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.థమన్, డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయడు, డైలాగ్స్: ఎం.రత్నం, రచనా సహకారం: శ్రీధర్ సీపాన, ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి.