బాలయ్య డిక్టేట‌ర్ ట్రైల‌ర్ ఎలా ఉందంటే…

నంద‌మూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేచిచూస్తున్న డిక్టేట‌ర్ ట్రైల‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ లోనే త‌న డైలాగుల‌తో సినిమాపై అంచ‌నాలు భారీగా పెంచేసాడు బాల‌కృష్ణ‌. ఇక ఇప్పుడు ఫుల్ ట్రైల‌ర్ లో రెచ్చిపోయాడు నంద‌మూరి న‌ట‌సింహం. శ్రీ‌వాస్ తెర‌కెక్కించిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో బాల‌య్య‌కు జోడీగా అంజ‌లి, సోనాల్ చౌహాన్ లాంటి ముద్దుగుమ్మ‌లు న‌టించారు. బాల‌య్య ఇమేజ్ కు త‌గ్గ‌ట్లు యాక్ష‌న్ ను చూపిస్తూనే.. త‌న స్టైల్ లో కామెడీని కూడా ఎక్క‌డా మిస్ చేయ‌లేదు శ్రీ‌వాస్.

కోన‌వెంక‌ట్, గోపీమోహ‌న్ క‌థ‌, స్క్రీన్ ప్లే ఎప్ప‌ట్లాగే కాస్త రొటీన్ గా క‌నిపిస్తున్నాయి. కానీ బాల‌య్య స్టైలిష్ అవ‌తార్.. పృథ్వీ కామెడీ.. అందాల భామ‌ల గ్లామ‌ర్ షో డిక్టేట‌ర్ పై అంచ‌నాలు పెంచేస్తున్నాయి. ఇక నేనే ప‌ని మొద‌లుపెట్ట‌ను.. పెడితే వ‌దిలిపెట్ట‌ను.. అంటూ బాల‌య్య విసిరిన పంచ్ డైలాగులు అభిమానుల‌కు ఫుల్ కిక్కిస్తున్నాయి.

చాలా రోజుల త‌ర్వాత బాల‌కృష్ణ కూడా కామెడీ చేస్తున్నారు. ట్రైల‌ర్ లో సోనాల్ కేవ‌లం అందాల ఆర‌బోత‌కే ప‌రిమితమైనా.. అంజ‌లి మాత్రం బాల‌య్య‌తోనే ఆడేసుకుంది. ఏకంగా ఆయ‌న్ని బాడీగార్డ్ గా పెట్టేసుకుంది. ఇక విక్ర‌మ్ జీత్ విల‌నీ.. ముంబై బ్యాక్ డ్రాప్ తో సాగే క‌థ‌.. ధ‌ర్మ‌గా బాల‌య్య న‌ట‌న‌.. డిక్టేట‌ర్ ట్రైల‌ర్ కు హైలైట్. మొత్తానికి ట్రైల‌ర్ కు పాస్ మార్కులు ప‌డిపోయాయి. ఇక ఇప్పుడు సినిమా కోస‌మే వెయిటింగ్. సంక్రాంతికి ఆ ముచ్చ‌ట కూడా తీరిపోనుంది. మ‌రి డిక్టేట‌ర్ తో బాల‌య్య ఏం సంచ‌ల‌నాలు సృష్టిస్తాడో చూడాలిక‌.