కొత్త పెళ్లి కూతురితో బాలయ్య

యువరత్న నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం లయన్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. సంక్రాంతి సంబరాల తర్వాత కొద్ది రోజుల పాటు పొలిటికల్ టూర్ వేసిన బాలయ్య తిరిగి షూటింగ్‌లో బిజీ అయ్యాడు. లయన్ న్యూ షెడ్యూల్ ఈ రోజు నుంచి హైదరాబాద్‌లో ప్రారంభమైంది. బాలయ్య సరసన రాధికాఆఫ్టే, త్రిష హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ఎల్‌వీ పతాకంపై రుద్రపాటి రమణరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. రామ్‌లక్ష్మణ్ నేతృత్వంలో ప్రస్తుతం బాలయ్య యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తున్నాడు. ఈ సన్నివేశాల్లో బాలయ్య పాటు ప్రకాష్‌రాజ్, కొత్త పెళ్లి కూతురు త్రిషతో నటిస్తున్నారు. ఈ షెడ్యూల్ వారం రోజుల పాటు జరుగుతుంది. ఈ సినిమాను మార్చి 28న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.