టెన్షన్ పెట్టిస్తున్న బాలయ్య

యువరత్న నందమూరి బాలకృష్ణ నటించిన లయన్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు కాస్త డివైడ్ టాక్ రావడంతో బాలయ్య తన నెక్ట్స్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. తనకు ప్రతిష్ఠాత్మకమైన వందో సినిమాకు ముందు వస్తున్న సినిమా కావడంతో 99వ సినిమా కథ బాగుండాలని… సినిమా బాగా రావాలని బాలయ్య ఎక్కడా రాజీ పడడం లేదట.

బాలయ్య 99వ సినిమాకు శ్రీవాస్ దర్శకత్వం వహిస్తారని ఈ సినిమాకు డిక్టేటర్ అనే టైటిల్ ఖరారైందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను ఏరోస్ ఫిలింస్ ఇంటర్నేషనల్‌తో కలిపి శ్రీవాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అయితే బాలయ్యకు కేవలం లైన్ మాత్రమే చెప్పిన శ్రీవాస్ ఇంకా పూర్తి స్టోరీ వినిపించలేదని… కథ మార్చమని దర్శకుడికి బాలయ్య చెప్పినట్టు టాక్. ప్రస్తుతం శ్రీవాస్ బాలయ్య చుట్టూ తిరుగుతూ ఆ స్టోరీని ఓకే చేయించుకునేందుకు బాలయ్య ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. దీంతో బాలయ్యతో ఆ స్టోరీని ఓకే చేయించుకునే పనిలో శ్రీవాస్ టెన్షన్‌గా ఉన్నాడని ఫిల్మ్‌నగర్ టాక్.

బాలయ్య కేరీర్‌లోనే తొలిసారిగా మాఫియాడాన్‌గా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్.థమన్ స్వరాలందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.