ఆహా బాల‌య్యా.. డాన్సులు అదిరాయి పో..!

వ‌య‌సు 55.. మ‌న‌సు 25.. ఎన‌ర్జీ 16.. ఎవ‌రివీ లెక్క‌లు అనుకుంటున్నారా..? ఇంకెవ‌రు బాలకృష్ణ గురించే మ‌నం మాట్లాడేది. ఈయ‌న ఎన‌ర్జీ లెవల్స్ ముందు ఏ కుర్ర హీరో ప‌నికిరాడు. 55 ఏళ్ల వ‌యసంటే సాధార‌ణంగా కీళ్ల‌నొప్పులు, కాళ్ల‌నొప్పులు అంటూ బాధ ప‌డుతుంటారు. కానీ న‌ట‌సింహం మాత్రం ఇంకా పాతికేళ్ల కుర్రాడిగా రెచ్చిపోతున్నాడు. డిక్టేట‌ర్ లో బాల‌య్య వ‌య‌సు 20 ఏళ్ళు త‌గ్గిపోయింది. నిజంగానే అంత యంగ్ గా క‌నిపించారు బాల‌య్య‌. 

యంగ్ గా క‌నిపించ‌డ‌మే కాదు.. ఆయ‌న చేసిన స్టంట్స్, డాన్సులు కూడా అలాగే ఉన్నాయి మ‌రి. కుర్ర హీరోలే డాన్సులు చేయ‌డానికి నానా తంటాలు ప‌డుతుంటే.. బాల‌య్య మాత్రం చాలా సింపుల్ గా స్టెప్స్ తో ఇర‌గ‌దీసారు. ముఖ్యంగా గ‌మ్ గ‌మ్ గ‌ణేషా పాట‌లో అయితే బాల‌కృష్ణ స్టెప్స్ మైండ్ బ్లోయింగ్ అనాలేమో. ఈ త‌రం కుర్ర హీరోలు కూడా అంత ఫాస్ట్ స్టెప్స్ వేయ‌డానికి కాస్త ముందూ వెన‌క ఆలోచిస్తారు. కానీ నందమూరి న‌ట‌సింహం మాత్రం వెన‌క‌డుగే వేసేది లేదంటున్నాడు.

ఆ ఒక్క పాట‌లో మాత్ర‌మే కాదు.. అన్ని పాట‌ల్లోనూ బాల‌య్య డాన్సులు అదిరిపోయాయి. అంజ‌లితో కొండ‌ల్లో పాడుకునే రొమాంటిక్ సాంగ్ లో స్లో స్టెప్స్ తో కేక పెట్టించాడు బాల‌య్య‌. ఇక బీచ్ లో సోనాల్ తో పాడుకునే వాట్స్ అప్ బేబీ సాంగ్ లో అయితే ఎన‌ర్జీతో దున్నేసారు. మొత్తానికి టీజ‌ర్స్ లోనే బాల‌య్య స్టెప్స్ ఇలా ఉంటే.. ఈ 55 ఏళ్ళ కుర్రాడి ఊపు చూసి రేపు థియేట‌ర్స్ లో అభిమానులు కూడా షాక్ అయిపోతారేమో..?