సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చిన బాల‌య్య..

మొన్న‌టికి మొన్న నంద‌మూరి వంశానికి నా కొడుకు ఎన్టీఆరే వార‌సుడు అంటూ నాన్న‌కు ప్రేమ‌తో ఆడియో ఫంక్ష‌న్ లో స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇది చాలా మంది నంద‌మూరి అభిమానుల‌కు కోపం కూడా తెప్పించింది. అయినా గానీ ఏ మాత్రం వెన‌క‌డుగేయ‌కుండా టైగ‌ర్ త‌న మాట‌ల తూటాల‌ను పేల్చారు. మ‌రోవైపు క‌ళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ కూడా తండ్రిని వెన‌కేసుకొచ్చారు. సీనియ‌ర్ ఎన్టీఆర్ కు అస‌లైన వార‌సుడు అంటే త‌మ తండ్రి హ‌రికృష్ణే అని మాట‌ల బాంబులు పేల్చారు.

ఈ మాట‌ల తూటాలు బాల‌య్య‌ను కూడా త‌గిలాయి. అప్ప‌ట్నుంచి స‌రైన వేదిక కోసం చూసిన నంద‌మూరి న‌ట‌సింహం.. డిక్టేట‌ర్ ప్లాటినం డిస్క్ ఫంక్ష‌న్ లో గ‌ర్జించాడు. పోటీ అయినా.. వార‌స‌త్వం అయినా నేను దిగ‌నంత వ‌ర‌కే. ఒన్స్ ఐ స్టెప్ ఇన్.. నో బ‌డీ కెన్ స్టాప్ మీ అంటున్నాడు బాల‌య్య‌. నంద‌మూరి వంశంలో నాతో పోటీ వ‌చ్చే వాడే లేడంటున్నాడు బాల‌కృష్ణ‌. నాకు నేనే పోటీ.. నాకు నాతోనే పోటీ.. అంతేగానీ నాతో పోటీ వ‌చ్చే ధీరుడు ఎవ్వ‌డంటూ మాట్లాడేసాడు బాల‌య్య‌.

పైకి చెప్ప‌కపోయినా.. ఈ సెటైర్లు అన్నీ జూనియ‌ర్ ఎన్టీఆర్ ను ఉద్ధేశ్యించే అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకుంటున్నాయి. బాబాయ్ కి ఈ మ‌ధ్యే అబ్బాయి అంటే అస్స‌లు ప‌డ‌ట్లేద‌నే వార్త‌లు ఇప్ప‌టికే గుప్పుమంటున్నాయి. ఇలాంటి టైమ్ లో డిక్టేట‌ర్ ప్లాటినం డిస్క్ ఫంక్ష‌న్ నంద‌మూరి వార‌సుల మ‌ధ్య వైరం ఏ స్థాయికి చేరిందో చెప్ప‌క‌నే చెప్పింది. త‌న‌కు అంత‌గా పోటీ రావాల‌నుకుంటే త‌న కొడుకు మోక్ష‌జ్ఞ‌, త‌న మ‌న‌వ‌డే పోటీ అంటూ చెప్పుకొచ్చాడు బాల‌య్య‌. ఇంకా ఇండ‌స్ట్రీకే రాని మోక్షుని త‌న పోటీ అంటున్నాడంటే.. అస‌లు బాల‌య్య దృష్టిలో ఎన్టీఆర్ అనే ఒక హీరోనే లేడ‌నే విష‌యం అర్థ‌మైపోతుంది. మరి ఈ వార్ ఇంకెంత దూరం వెళ్లి ఆగుతుందో చూడాలి.