లయన్ ఫస్ట్ లుక్ కేక -లుంగీ.. కోరమీసంలో బాలయ్య

యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా నూతన దర్శకుడు సత్యదేవా దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా (వర్కింగ్ టైటిల్ లయన్) పల్లిబఠాని.కామ్ ఎక్స్‌క్లూజివ్‌గా సంపాదించింది. ఈ లుక్‌లో బాలయ్య కోర మీసంతో లుంగీ వేసుకుని చాలా స్టైల్‌గా నడిచి వస్తున్నాడు. స్పెట్స్‌తో ఉన్న ఈ లుక్ బాలయ్య అభిమానుల్లో కేక పుట్టిస్తోంది. ఈ సినిమాలో ఓ సాంగ్ చిత్రీకరణలో భాగంగా ఈ స్టిల్ వస్తుంది. లెజెండ్ హిట్‌తో పాటు బాలయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఎస్ఎల్‌వీ సినిమా పతాకంపై రుద్రపాటి రమణరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలయ్య సరసన సోనాల్‌చౌహాన్, త్రిష హీరోయిన్లుగా నటించారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ చివరి వారం లేదా జనవరి తొలి వారంలో ఆడియోను విడుదల చేసి జనవరి నెలాఖరకు సినిమాను ప్రేక్షకుల ముందకు తేనున్నారు. బాలయ్య పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. ఏదేమైనా ఈ లుక్ ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్‌లో కేక పుట్టిస్తోంది. మరో హిట్ ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.