నందమూరి బాలకృష్ణ వెంట బళ్లారి సాయి సైన్యం..

నందమూరి బాలకృష్ణ తొలిసారి ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి వస్తూ తమ పార్టీ తరపున హిందూపురం అసెంబ్లీస్ధానానికిగాను బరిలోకి దిగటంతో ..బాలయ్య బాబు అబిమానులందరు ఇప్పుడు పొలిటికల్‌గా ఆయనే వెంటే ఉంటూ ప్రత్యక్షంగా తమ పూర్తి సపోర్ట్‌ను అందించెందుకు సిద్దమవుతున్నారు.

ఒక్క హిందుపూర్‌ నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్ర్రంలోని బాలయ్య అబిమానులెందరో ఇప్పుడు హిందుపూర్‌ లో బాలయ్య వెనుక ఉంటూ స్వచ్చందంగా టిడిపి ప్రచార బాద్యతలను చెపట్టడానికి రెడీ అవుతున్నారు.ఇక లెజెండ్‌ సినిమాతో బాలయ్య బాబుకు అత్యంత సన్నిహితుడిగా మారిన ఆ చిత్ర నిర్మాత కొర్రపాటి సాయి ఇప్పుడు హిందుపురంలో బాలయ్య రాజకీయప్రచారానికి సంబందించిన అన్ని కార్యక్రమాలను నిర్వహించనున్నారట.

ఇందుకోసం సాయి కుటుంబసభ్యులు ,అనుచరులు అనుక్షణం బాలయ్య బాబు వెంటే ఉంటూ నామినేషన్ మొదలుకోని ఎలెక్షన్‌ వరకు అన్నీ కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా బాద్యతలను నిర్వర్తించటానికి సిద్దమయినట్లు సమాచారం.

టిడిపికి కంచుకోట లాంటి హిందుపురంలో బాలయ్య బాబు గెలుపు లాంచనమే అయినప్పటికి..రికార్డ్‌ మోజారిటీతో తమ హీరోను గెలిపించుకోవటానికి బాలయ్య అనుచరులు ఇలా బారీ యెత్తున ప్రచార కార్యక్రమాలను చెస్తూ తమ అబిమానాన్ని చాటుకుంటున్నారు.