బందిపోటు ప్రివ్యూ… ఎక్స్‌క్లూజివ్ హైలెట్స్

సినిమా: బందిపోటు
నటీనటులు: అల్లరి నరేష్, ఇషా
బ్యానర్: ఈవీవీ సినిమా
సంగీతం: కళ్యాణీ మాలిక్
నిర్మాతలు: రాజేష్ ఈదర, నరేష్ ఈదర
దర్శకత్వం: ఇంద్రగంటి మోహన్‌కృష్ణ
విడుదల తేదీ: 20 ఫిబ్రవరి, 2015

అల్లరి నరేష్-ఇంద్రగంటి మోహన్‌కృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం బందిపోటు. ఈవీవీ సినిమా పతాకంపై నరేష్ సోదరుడు రాజేష్ ఈ సినిమాను నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ఈ సినిమా ఎలా ఉంటుందో పల్లిబఠాని.కామ్ ప్రివ్యూలో చూసొద్దాం.

బందిపోటు స్టోరీ:
బందిపోటులో అల్లరి నరేష్ ఘరానా దొంగగా కనిపిస్తాడు. ఈ దొంగ ఏదైనా అనుకున్నది సాధించాలనుకుంటే దాని కోసం ఎంతైనా రిస్క్ చేస్తాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఇదే టైటిల్‌తో సీనియర్ ఎన్టీఆర్ హీరోగా 1968లో బందిపోటు టైటిల్‌తో వచ్చిన సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ ఘరానా దొంగ ఇషతో లవ్‌లో పడతాడు. ఆమె కోసం చాలా అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. చివరకు ఈ ఘరానా దొంగ మంచిదొంగగా మారి తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడన్నదే చిత్ర కథాంశం.

బందిపోటు నటీనటులు పెర్ఫామెన్స్:
అల్లరి నరేష్‌కు ఇలాంటి కామెడీ సినిమాలు కొట్టిన పిండి. నరేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అచ్చతెలుగమ్మాయి అయిన అంతకుముందు ఆ తరువాత ఫేం ఇష నరేష్‌కు జోడీగా నటిస్తోంది. బర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్‌బాబు, అవసరాల శ్రీనివాస్ మిగిలిన పాత్రలు పోషించారు. వీరి పాత్రలు కూడా సినిమాకు హైలెట్ కానున్నాయి. పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి కూడా సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషించారు.

బందిపోటు టెక్నికల్ డిపార్ట్‌మెంట్ ఎక్స్‌పెక్టేషన్స్:
కళ్యాణి మాలిక్ సంగీతం అందించిన పాటలు బాగున్నాయి. కామెడీ అండ్ థ్రిల్లింగ్ సినిమా కావడంతో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఇక ఈవీవీ బ్యానర్‌పై ఈవీవీ లేకుండా తొలిసారిగా నిర్మిస్తున్న సినిమా ఇదే. అల్లరి నరేష్ కేరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. 

ఇక గ్రహణం లాంటి విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమా, గోల్కొండ హైస్కూల్ లాంటి హిట్ సినిమా అందించిన మోహన్‌కృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా స్టోరీ విన్న పలువురు సినిమా తప్పకుండా హిట్ అవుతుందని చెపుతున్నారు. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి కూడా సినిమాపై ధీమాతో ఉన్నారు.

ఫైనల్‌గా…
ఈవీవీ బ్యానర్‌పై నిర్మితమవుతున్న బందిపోటు చిత్రం భారీ అంచనాలతో శుక్రవారం ఎక్కువ థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ పల్లిబఠాని.కామ్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.