ధనరాజ్ అండ్ కో బంతిపూల జానకి టైటిల్ లోగో ఆవిష్కరించిన మోహన్ లాల్

ధన్ రాజ్, దీక్షా పంత్, మౌనిక, షకలక శంకర్, చమక్ చంద్ర, సుడిగాలి సుదీర్, రాకెట్ రాఘవ, అదుర్స్ రఘు, అప్పారావు, రచ్చ రవి ముఖ్య పాత్రల్లో రూపొందుతున్న చిత్రం "బంతిపూల జానకి". ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్సకత్వంలో శ్రీమతి కళ్యాణి రామ్ నిర్మిస్తున్నారు. అతి త్వరలో సెట్స్ కు వెళ్లి, సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ చిత్రం టైటిల్ లోగోను మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఆవిష్కరించి, ధన రాజ్ బృందాన్ని అభినందించారు.

ఈ సందర్భంగా ధనరాజ్ మాట్లాడుతూ.. "ఒక సరికొత్త జోనర్ లో రూపొందనున్న చిత్రమిది. మేం అడిగిన వెంటనే.. మా చిత్రం లోగోను ఆవిష్కరించిన సూపర్ స్టార్ మోహన్ లాల్ గారికి "బంతిపూల జానకి" బృందం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను" అన్నారు.

ఈ చిత్రానికి పబ్లిసిటీ డిజైనర్: వివా, కెమెరా: జి.ఎల్.బాబు, ఎడిటింగ్: శివ.వై.ప్రసాద్, పాటలు: కాసర్ల శ్యామ్, మ్యూజిక్: బోలె, కథ-మాటలు: శేఖర్ విఖ్యాత్, నిర్మాత: శ్రీమతి కళ్యాణి రామ్, స్క్రీన్ ప్లే-దర్సకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్!!