భారతీయుడికి నోబెల్ ఫ్రైజ్.. ప్రపంచంలో అరుదైన గౌరవం

మనదేశానికి అరుదైన గౌరవం దక్కించి. ప్రపంచ దేశాలన్నింటిలో మనదేశం సగర్వంగా తలెత్తుకునే అపురూప ఘట్టం ఈ ఈ రోజు జరిగింది. మనదేశానికి చెందిన కౌలాస్ సత్యార్థికి నోబెల్ పురస్కారం దక్కింది. బాలల హక్కుల కోసం చేసిన పోరాటానికి ఆయనకు నోబెల్ ఫ్రైజ్‌తో తగిన గుర్తింపు లభించింది. నార్వేయన్ నోబెల్ కమిటి శుక్రవారం ప్రకటించిన అవార్డుల్లో మనదేశానికి చెందిన కైలాస్ సత్యార్థి పాకిస్తాన్‌కు చెందిన మలాలా యూసఫ్ జాయ్‌తో కలిసి నోబెల్ శాంతి పురస్కారం అవార్డు అందుకున్నారు. ఈయన 1990 నుంచి బాల కార్మికుల హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈయన 80 వేల మంది బాలలకు వెట్టి చాకిరి నుంచి విముక్తి కలిగించి పునరావాసం కల్పించి ప్రపంచ రికార్డు సాధించారు. బచ్‌వన్ బచావో ఆందోళన సంస్థ స్థాపించి అనాథ బాలికలకు పునరావాసం విద్య అందిస్తున్నారు. 

ఎవరి కైలాస్ సత్యార్థి..
మధ్యప్రదేశ్‌లోని విదిశ ప్రాంతానికి చెందిన ఈయన బాలల హక్కుల కోసం రెండు దశాబ్దాలుగా అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ఆయన బాలల హక్కుల కోసం న్యూఢిల్లీలో నివసిస్తూ దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. చాలా సాధారణమైన జీవితం గడుపుతున్నారు. ఆయన బాలల హక్కుల కోసం చేసిన పలు పోరాటాలకు అంతర్జాతీయంగా పలు అవార్డులు లభించాయి. ఆయనకు నోబెల్ అవార్డు దక్కడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఆయన పేరు మార్మోగుతోంది. ఆయనకు పలువురు నాయకులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు తమ అభినందనలు తెలియజేస్తున్నారు. కాగా పాకిస్తాన్‌కు చెందిన మలాలా బాలికల విద్యాహక్కుల కోసం తీవ్రవాదుల తూటాలకు ఎదురొడ్డి నిలుచున్నారు.