తెలంగాణలో పెరిగిన బీరు ధరలు

మందు బాబులకు తెలంగాణ సర్కారు కిక్కిచ్చే…షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సమ్మర్లో బీర్ల అమ్మకాలకు డిమాండ్ ఎక్కువ. మంచి సమయం చూసుకొని బీరు ధరలను పెంచేసింది. పెరిగిన బీరు ధరలతో ప్రభుత్వానికి దాదాపు 400 కోట్ల వరకు ఆదాయం పెరగనుంది.

తెలంగాణలో బీరు ధరలను పెంచాలని అబ్కారీ శాఖ చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. సాధారణ బీరు సీసాపై రూ.5, స్ట్రాంగ్ బీరు సీసాపై రూ.10 పెంచాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలపై మంత్రి పద్మారావు సంతకం చేశారు.

మద్యం అమ్మకాల ద్వారా నెలకు రూ.900 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. ఇప్పుడు పెరిగిన ధరలతో 10 శాతం వరకు పెరుగుతుందని… దీని వల్ల సుమారు రూ.400 కోట్ల వరకు ఆదాయం ఉంటుందని ఆబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.