భలే భలే మోషన్ పోస్టర్ తో నానికి హిట్టు కళ

చూస్తుంటే నానికి హిట్టు క‌ళ కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. ఈ మ‌ధ్య కాలంలో స‌రైన విజ‌యం లేక అల్లాడిపోతున్న ఈ కుర్ర‌హీరోకి మారుతి జ‌త‌క‌లిసాడు. ఈయ‌న‌కి ఈ మ‌ధ్య స‌రైన విజ‌యం లేదు. కొత్త‌జంట సోసోగా బ‌య‌ట‌ప‌డింది. ఇక నానికి కూడా ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం కాస్త ప‌ర్లేదు అనిపించింది. ఇప్పుడు ఈ ఇద్ద‌రూ క‌లిసి భ‌లేభ‌లే మ‌గాడివోయ్ సినిమా చేస్తున్నారు. లావ‌ణ్య త్రిపాఠి ఇందులో హీరోయిన్. 

పూర్తిస్థాయి కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా దీన్ని తెర‌కెక్కిస్తున్నాడు మారుతి. తాజాగా ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌లైంది. బ్యాట‌రీ నిల్.. ఎంట‌ర్ టైన్ మెంట్ ఫుల్ అనే పంచ్ లైన్ తో విడుద‌లైన ఈ మోష‌న్ పోస్ట‌ర్ బాగా ఆక‌ట్టుకుంటోంది. మ‌రి చూడాలి.. ఇటునాని.. అటు మారుతి ఒకే సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టేస్తారేమో…