సెన్సార్ పూర్తి చేసుకొని ఈ నెల 25న రానున్న " భలే మంచి రోజు "

సుధీర్ బాబు హీరోగా కొత్త దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వం లో 70 ఎమ్.ఎమ్.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ రెడ్డి, శశిధర్ రెడ్డి నిర్మిస్తున్న కొత్త చిత్రం "భలే మంచి రోజు". ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్రిస్మస్ కానుకగా 25న విడుదలకు సిద్ధమైంది. పూర్తిగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు సరికొత్త రీతిలో వినోదాన్ని జోడించి రూపొందించిన ఈ చిత్రానికి " యు / ఎ " సర్టిఫికేట్ వచ్చింది. టాలీవుడ్ లో రొటీన్ సినిమాలు ఎక్కువ అవుతున్న నేపద్యంలో "భలే మంచి రోజు" సినిమా కొత్తగా అనిపించిందని సెన్సార్ వాళ్ళు కూడా అభినందించడం విశేషం. ట్రైలర్, ఆడియో తో "భలే మంచి రోజు" సినిమా మీద జనాల్లో ఆసక్తి బాగా పెరిగింది. కొత్త తరహ సబ్జెక్టు, కొత్త కథలను ఎంచుకునే సుధీర్ బాబు, యువ దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య, యువకులైన టీం, సూపర్ హిట్ అయిన పాటలు ఇలా అన్ని వైపుల నుండి "భలే మంచి రోజు" సినిమాకి ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పడింది.

భారి సాంకేతిక విభాగంతో రూపుదిద్దుకున్న భలే మంచి రోజు సినిమా కచ్చితంగా జనాలకి ఒక కొత్త థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తుందని , ఈ 25న ఫ్యామిలి తో హ్యాపీ గా చూసి ఎంజాయ్ చూడదగిన సినిమా అని దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య విశ్వాసం వ్యక్తం చేసారు. సుధీర్ బాబు కెరీర్ లోనే ఎన్నడు లేని విధంగా అత్యదిక ధియేటర్లలో 25న "భలే మంచి రోజు " సినిమాను విడుదల చేస్తున్నామని విజయ్ మరియు శశి ప్రకటించారు.