భీమవరం టాకీస్ లో ఐదుగురు దర్శకుల సినిమా

65 స్ట్రెయిట్ సినిమాలు నిర్మించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఇటీవలే ట్రాఫిక్, వీరుడొక్కడే, బచ్చన్ వంటి అనువాద చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఇప్పుడు 69వ సినిమాగా  ఓ వైవిధ్యమైన సినిమా నిర్మించనున్నారు. ఐదుగురు దర్శకులతో ఐదు కథలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఐదు కథలతో, ఐదుగురు ప్రముఖ దర్శకులతో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఆ ఐదుగురు ఎవరనేది అధికారికంగా త్వరలోనే ప్రకటిస్తాం. ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్ లా నిలిచిపోతుంది. చిత్ర ప్రచారాన్ని సైతం వైవిధ్యంగా ఐదు ఓపెనింగ్స్, ఐదు ఆడియో ఫంక్షన్స్ నిర్వహించనున్నాం. అలాగే అయిదు కథలకు అయిదు టీజర్స్, అయిదు ట్రైలర్స్ రిలీజ్ చేయనున్నాం. అని అన్నారు.