బిగ్ బాస్ సీజ‌న్ 3కి చెప్పుకోలేని క‌ష్టాలు.. పాపం నాగార్జున‌..

బిగ్ బాస్ తొలి సీజ‌న్ దుమ్ము దులిపేయ‌డంతో రెండో సీజ‌న్ కూడా అరిపిస్తుందని అంతా అనుకున్నారు. కానీ అనుకున్న‌ట్లు కాకుండా కాస్త తేడా కొట్టింది ఇది. నాని హోస్టుగా ఉన్నా కూడా ఎందుకో తెలియ‌దు కానీ తొలి సీజన్ తో పోలిస్తే రెండో సీజ‌న్ కాస్త త‌గ్గింది. దాంతో ఇప్పుడు మూడో సీజ‌న్ కోసం మ‌రోసారి స్టార్ హీరోనే తీసుకొచ్చారు. నాగార్జున రావ‌డంతో క‌చ్చితంగా ఈ సీజ‌న్ ర‌ప్ఫాడిస్తుంద‌ని న‌మ్ముతున్నారు షో నిర్వాహ‌కులు. కానీ ఆదిలోనే హంస‌పాదు అన్న‌ట్లుగా ఉంది ఇప్పుడు బిగ్ బాస్ సీజ‌న్ 3 ప‌రిస్థితి. అస‌లు ఈ షోకు ఇప్ప‌టి వ‌ర‌కు వాళ్లొస్తున్నారు.. వీళ్లొస్తున్నార‌ని టాక్ త‌ప్ప ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రొస్తున్నారనే విష‌యంపై క‌న్ఫ‌ర్మేష‌న్ అయితే లేదు. ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ ఉంది. అస‌లు ఈ షోకు రావ‌డానికి స్టార్స్ ఎవ‌రూ ఆస‌క్తి చూపించ‌డం లేద‌ని తెలుస్తుంది. 
ఇందులో వ‌చ్చినా కూడా ఎవ‌రూ పెద్ద‌గా క్లిక్ కాక‌పోవ‌డం.. బిగ్ బాస్ 1,2 సీజ‌న్ విన్న‌ర్స్ శివ‌బాలాజి, కౌశ‌ల్ కెరీర్స్ కూడా ఎక్క‌డ వేసిన గొంగ‌లి అక్క‌డే ఉండ‌టంతో ఇందులో పాల్గొన‌డానికి కూడా ఎవ‌రూ ఆస‌క్తి చూపించ‌డం లేద‌నేది లేటెస్ట్ న్యూస్. దాంతో స్టార్ మాకు ఇందులో ఎవ‌ర్ని సెలెక్ట్ చేసుకోవాలో తెలియ‌క చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. పేరున్న వాళ్లు లేక‌పోతే షో స‌క్సెస్ కాదు.. అలాగ‌ని ఎవ‌ర్ని ప‌డితే వాళ్ల‌ను ఎంచుకుంటే అస‌లుకే మోసం వ‌స్తుంది. దాంతో ఇప్పుడు త‌ల ప‌ట్టుకున్నారు స్టార్ మా యాజ‌మాన్యం. మ‌రోవైపు జులై 21 నుంచి షో మొద‌లు పెట్టాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారు. మ‌రి చివ‌రికి ఏం జ‌రుగుతుందో చూడాలి.