చేతులు నరికేస్తానన్న సీఎం


బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రాం మాంఝీకి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఎప్పుడూ ఏదో ఒక సంచలన వాఖ్యలు చేస్తూ పేపర్లలో పతాక శీర్షికల్లో ఉండే ఆయన ఆగ్రహానికి ఈ సారి వైద్యులు బలయ్యారు. పేదల ప్రాణాలతో చెలగాటమాడితే చేతులు నరికేస్తానని ఆయన వైద్యులను హెచ్చరించారు. పూర్తి వివరాల్లోకి వెళితే పాట్నాలో రావణ దహనం సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగింది. అక్కడ గాయపడిన క్షతగాత్రులు ఆసుపత్రికి వస్తే వారికి అక్కడ వైద్యం చేయడానికి వైద్యులు లేరు. మందులు కూడా లేవు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కనీసం సూపరింటెండెంట్‌ను పిలిస్తే ఆయన కూడా లేరు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన జీతన్ వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు వైద్యం చేయడంలో అలసత్వం వహిస్తే వారి చేతులు నరికేస్తానని తీవ్ర ఆవేశంతో ఊగిపోయారు.

అయితే సీఎం వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్త మవుతున్నాయి. ఆయన సీఎం అయ్యాక బీహార్‌లో జీడీయూ తరచూ తల పట్టుకోవాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే ఆయన ఓ సారి బహిరంగంగా తాగడం తప్పుకాదని వ్యాఖ్యానించారు.