జూబ్లీహిల్స్ లో బైక్ రేసింగ్ యువకుల అరెస్ట్

హైదరాబాద్ లో బైక్ రేసింగ్ చేస్తున్న వారిని అరెస్ట్ చేసినా… ఎన్ని శిక్షలు విధించినా మార్పు ఇసుమంతైనా కనిపించట్లేదు. ముఖ్యంగా రాజకీయ, సినీ, వ్యాపారవేత్తల కుమారులు ఈ బైక్ రేసింగ్ లో పాల్గొంటున్నారు. తాజాగా బైస్ రేసింగ్ కు పాల్పడ్డ 15మంది యువకుల్ని జూబ్లీహిల్స్ పోలీసులు గత అర్థరాత్రి అరెస్ట్ చేశారు. చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ వరకు ఈ బైక్ రేసింగ్ లు నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు వీరిని పట్టుకున్నారు.

మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ ఇతర వాహనాదారుల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. మొత్తం ఏడు బైకుల్ని స్వాధీనం చేసుకొని పోలీసులు విచారిస్తున్నారు. అయితే వీరిలో పెద్ద కుటుంబాలకు చెందిన పిల్లలున్నారని సమాచారం. దీంతో పోలీసుల మీద ఒత్తిడి బలంగా ఉందని తెలుస్తోంది. కానీ స్థానికులు మాత్రం వీరికి కఠిన శిక్షలు వేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. పోలీసులు ఒత్తిళ్లకు లొంగకుండా కేసులు బుక్ చేయాలని వారు కోరుతున్నారు.