బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ ట్రైలర్ అదిరింది… అంచనాలు పెరుగుతున్నాయి

ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్. మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘనా జంటగా నటించారు. గోరేటి వెంకన్న ఓ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు నాగసాయి మాకం తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాట సూపర్ హిట్ అవగా…తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ అదిరిపోయింది. పల్లెటూరి వాతావరణంలో జరిగే వినోదాత్మక చిత్రంగా బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ ఉంటుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. కామెడీతో పాటు యాక్షన్ కూ ప్రాధాన్యత ఇచ్చారు. ట్రైలర్ ఆకట్టుకుంటున్న నేపథ్యంలో బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ సినిమా ఈ నెలలోనే విడుదలకు సిద్ధమవుతోంది.

ప్రణవి, ఆర్ ఎస్ నందా, వెంకట్ గోవాడ, మల్లేష్, వైభవ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – తోట వి రమణ, ఎడిటింగ్ – ఎస్ బీ ఉద్ధవ్, సంగీతం – సాబూ వర్గీస్, రీ రికార్డింగ్ – జీబూ, డీటీఎస్ – రాజశేఖర్, పాటలు – గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, రామాంజనేయులు, మౌనిశ్రీ మల్లిక్, నీల నర్సింహా, కథా, నిర్మాత – మహంకాళి శ్రీనివాస్, రచన, దర్శకత్వం – నాగసాయి మాకం.