నా హెల్త్ బాగుంది. అన్నీ రూమర్సే…సూర్యతో చేస్తున్నా – బిందు మాధవి

నేను బాగానే ఉన్నాను బాబోయ్‌ అంటున్న బిందు మాధవి : గత కొన్ని గంటలుగా సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో ‘‘బిందు మాధవికి అస్వస్థత/ బిందు మాధవి ఆరోగ్యం బాగోలేదు’’ అంటూ వెబ్‌సైట్లలో వస్తున్న వార్తలు సర్క్యులేట్‌ అవుతున్నాయి. 

ఆ వార్తలు వాస్తవం కాదని, ఎవరో గాసిప్‌ రాయుడు సృష్టించిన గాలి వార్త అని స్వయంగా బిందు మాధవి స్పష్టం చేసింది. ప్రస్తుతం చెన్నయిలో ప్రముఖ తమిళ నటుడు సూర్య నిర్మిస్తూ నటిస్తున్న ఓ చిత్రం షూటింగ్‌లో ఉన్న తాను` అస్వస్థతకు లోనవ్వడం, హాస్పిటల్‌లో జాయినవ్వడం.. ఇవన్నీ పుకార్లు మాత్రమేనని బిందు మాధవి మీడియాకు తెలిపింది.
ప్రస్తుతం తాను ఉన్న లొకేషన్‌ నుంచే ఒక ఫోటో సైతం తీసి పంపించి` తాను క్షేమంగా ఉన్నానని వెల్లడిరచింది!
PressNote