ప్చ్..ఆ ద‌ర్శ‌కుడు మ‌ళ్లీ ఫెయిల‌య్యాడే..!

ద‌రిద్రం నెత్తిమీద డిస్కో చేస్తున్న‌పుడు ఏ ప‌ని చేసినా క‌లిసి రాదు. ఇప్పుడు బొమ్మ‌రిల్లు భాస్కర్ ప‌రిస్థితి కూడా అలాగే త‌యారైంది. తెలుగులో సొంత క‌థ‌లు చేసి చేతులు కాల్చుకున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. బొమ్మ‌రిల్లు. ప‌రుగు సినిమాల‌తో స్టార్ డైరెక్ట‌ర్ అయిపోయిన భాస్క‌ర్.. ఒంగోల్ గిత్త‌, ఆరెంజ్ సినిమాల‌తో నేల మీదికి వ‌చ్చాడు. తెలుగులో ఎలాగూ అవ‌కాశాలు రావ‌ట్లేదు క‌దా అని త‌మిళ ఇండ‌స్ట్రీకి వెళ్లిపోయాడు. అక్క‌డ అదృష్టం బాగుండి బెంగ‌ళూర్ డేస్ త‌మిళ రీమేక్ తెర‌కెక్కించే అవ‌కాశం అందుకున్నాడు.

ఆల్రెడీ హిట్టైన సినిమానే క‌దా.. త‌మిళ ప్రేక్ష‌కుల‌కు త‌గ్గ‌ట్లు కాస్త మార్చి తీస్తే హిట్ గ్యారెంటీ అనుకున్నారంతా. కానీ సీన్ రివ‌ర్స్ అయింది. మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీలో చ‌రిత్ర సృష్టించిన బెంగళూర్ డేస్.. త‌మిళ్ కి వ‌చ్చేస‌రికి చ‌ప్ప‌బ‌డిపోయింది. భాస్క‌ర్ చేసిన త‌ప్పో.. లేదంటే క‌థే క‌నెక్ట్ అవ్వ‌లేదో తెలియ‌దు గానీ బెంగ‌ళూర్ నాట్క‌ల్ త‌మిళ‌నాట క‌లెక్ష‌న్ల వేట‌లో వెన‌క‌బ‌డింది. క‌థ‌ను హ్యాండిల్ చేయ‌డంలో.. ఎమోష‌న్ ను క్యారీ చేయ‌డంలో భాస్క‌ర్ ఫెయిల‌య్యాడంటూ ఇప్పుడు ఆయ‌న్నే ఆడిపోసుకుంటున్నాయి త‌మిళ ప‌త్రిక‌లు.

రానా, ఆర్య‌, శ్రీ‌దివ్య‌, స‌మంత లాంటి స్టార్ క్యాస్టింగ్ ఉన్నా.. బెంగ‌ళూర్ నాట్క‌ల్ నామ‌మాత్ర‌పు వ‌సూళ్ల‌నే సాధిస్తుంది. తొలి వారాంతంలో ఓకే అనిపించినా.. సోమ‌వారం నుంచే క‌లెక్ష‌న్ల‌లో భారీ డ్రాప్ క‌నిపిస్తుంది. ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తోనే నిర్మించాడు పివిపి. కానీ ఏం చేస్తాం.. భాస్క‌ర్ సుడి తిర‌గ‌లేదు. అందుకే హిట్ మాల్ కూడా.. ప్లాప్ అయింది. ఈ సినిమాతోనైనా మ‌ళ్లీ ఫామ్ లోకి రావాల‌ని కోటి ఆశ‌ల‌తో ఉన్న బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కు బెంగ‌ళూర్ నాట్క‌ల్ ప్లాప్ దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డేసింది. చూడాలిక‌.. ఈ ద‌ర్శ‌కున్ని ఆదుకునే హీరో ఎవ‌రో..?