కోహ్లీ, రహానే భారీ సెంచరీలు.. భారత్ ధీటైన జవాబు: 462/8

మెల్‌బోర్న్ టెస్ట్‌లో భారత్ ధీటైన జవాబిస్తోంది. బాక్సింగ్ డే టెస్ట్‌లో భాగంగా మూడో రోజు ఇన్సింగ్స్ కొనసాగించిన భారత్ 8 వికెట్లు కోల్పోయి 462 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి, అజ్యంకా రహానే భారీ సెంచరీలు సాధించారు. కోహ్లి 169 పరుగులు, రహానే 147 పరుగులు సాధించారు. మురళీ విజయ్ 68, ఛటేశ్వర్ పుజారే 25 పరుగులు సాధించారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి మహ్మద్ షమీ 9 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ర్యాన్ హరీస్ 4 వికెట్లు సాధించాడు. నాథన్ లియాన్ 2 వికెట్లు తీశారు.