సెల్‌ఫోన్ కోసం అక్కా,బావ‌ను కాల్చేశాడు

సెల్‌ఫోన్ కొనివ్వ‌లేద‌న్న‌కోపంతో ఆ యువ‌కుడు త‌న సొంత అక్కాబావ‌నే కాల్చి చంపేశాడు. మిజోరాం రాజ‌ధాని ఐజ్వాల్‌లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. ప‌ద‌హారేళ్ల యువ‌కుడు ఈ దారుణానికి ఒడిగ‌ట్టాడు. జులై 7న మొబైల్ ఫోన్ కొనేందుకు త‌న సోద‌రిని డ‌బ్బు అడ‌గ‌డంతో ఆమె నిరాక‌రించింది.

అయితే ఆమెపై అక్క‌సు పెంచుకున్న అత‌డు జంతువులను వేటాడటానికి ఉపయోగించే తుపాకీతో అక్కను, బావను కాల్చేశాడు. అంతటితో ఆగకుండా గొడ్డలితో వారిద్ద‌రిని దారుణంగా న‌రికేశాడు. త‌ర్వాత ఇంట్లో నుంచి రూ.36 వేలు ఎత్తుకెళ్లాడు. జువెనైల్ జస్టిస్ బోర్డు జరిపిన విచారణలో బాలుడు నేరాన్ని అంగీకరించాడు. ప్రభుత్వ సంక్షేమ పథకం ద్వారా ఆ దంపతులకు ఇటీవలే రూ.66 వేలు లభించ‌గా.. అందులో కొంత ఖర్చు చేశారని, మిగితా రూ.30 రూపాయలతో ఫోన్ కొనివ్వాలని అక్క‌, బావ‌తో గొడ‌వ‌ప‌డిన నిందితుడు వారిద్ద‌రిని హ‌త‌మార్చిన‌ట్టు పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డైంది.