శ్రీలంకకు మెక్‌కల్లమ్ చుక్కలు… ప్రపంచ రికార్డ్ మిస్

న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. క్రైస్ట్‌చర్చ్‌లో శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో తొలి రోజు న్యూజిలాండ్ బ్యాటింగ్ చేపట్టింది. మెక్‌కల్లమ్ విధ్వంసం సృష్టించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 429 పరుగులు సాధించింది. కెప్టెన్ మెక్‌కల్లమ్ 134 బంతుల్లో 18 ఫోర్లు, 11 సిక్సర్లతో 195 పరుగులు సాధించాడు. మరో ఐదు పరుగులు సాధిస్తే టెస్టుల్లో వేగవంతమైన డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సాధించేవాడు. మిగిలిన ఆటగాళ్లలో విలియమ్సన్(54), నీషమ్ (85) అర్థ సెంచరీలు సాధించారు.