బ్రూస్ లీ, రుద్ర‌మ‌దేవి క‌లెక్ష‌న్ల ప‌రిస్థితి ఏంటి..?

ద‌స‌రా సీజ‌న్ అంటే కొత్త సినిమాల‌కు పెట్టింది పేరు. సెల‌వుల్లో కొత్త సినిమాలు చూడాల‌ని అనుకోని ప్రేక్ష‌కులు ఉండ‌రు. ఈ సీజ‌న్ లో యావ‌రేజ్ సినిమా ఇచ్చినా చాలు.. ప్రేక్ష‌కులు క‌లెక్ష‌న్ల‌తో పండ‌గ చేయిస్తారు. ఈ సారి కూడా రుద్ర‌మ‌దేవి, బ్రూస్లీ పండ‌గ సీజ‌న్ లోనే విడుద‌ల‌య్యాయి. అక్టోబ‌ర్ 9కి విడుద‌లైన రుద్ర‌మ‌దేవి.. తొలి మూడు రోజుల్లోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా 25 కోట్లు కొల్ల‌గొట్టింది. ఇప్ప‌టివ‌ర‌కు రుద్ర‌మ‌దేవి వ‌చ్చి 10 రోజులు గ‌డిచింది. ఈ సినిమా వ‌సూళ్లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 35 కోట్ల‌కు మించ‌లేదు.

బ్రూస్లీ విడుద‌లైన త‌ర్వాత రుద్ర‌మ‌దేవికి భారీగా గండి ప‌డిపోయింది. రుద్ర‌మ‌దేవి థియేట‌ర్స్ లో ఆల్ మోస్ట్ 70 శాతం థియేట‌ర్స్ బ్రూస్లీకి ఇచ్చేసారు. దాంతో ఆటోమేటిక్ గా రుద్ర‌మ‌దేవి వ‌సూళ్ల‌కు గండి పడింది. మ‌రోవైపు బ్రూస్లీ కూడా తొలిరోజు ఏకంగా 12.75 కోట్లు కొల్ల‌గొట్టింది. కానీ త‌ర్వాత రెండు రోజులు అదే జోరు చూపించ‌లేక‌పోయింది.

సినిమాకు నెగిటివ్ టాక్ బాగా స్ర్పెడ్ అయిపోవ‌డంతో రెండోరోజు 3.65 కోట్లు, మూడోరోజు 4.68 కోట్లు వ‌సూలు చేసింది బ్రూస్లీ. నైజాంలో మూడు రోజుల‌కు గానూ కేవ‌లం 6 కోట్లే వసూలు చేసింది ఈ సినిమా. 13.52 కోట్ల‌కు నైజాం రైట్స్ కొనుగోలు చేయ‌డంతో.. ఆ వ‌సూళ్లు రావ‌డం ఇప్పుడు గ‌గ‌నంగా మారింది. మిగిలిన చోట్ల కూడా బ్రూస్ లీ క‌లెక్ష‌న్లు అంత ఆశాజ‌న‌కంగా లేవు. మ‌రోవైపు ఈ వారం కంచె కూడా వ‌చ్చేస్తుండటంతో బ్రూస్లీకి మ‌రింత గండి ప‌డ‌నుంది.