మీది బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైనా.. ఇక ప్రతి రాత్రి పండగే..

ప్రభుత్వ టెలికం సంస్థ BSNL బంపర్ ఆఫర్ ప్రకటించింది. కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు ఆకర్షణీయ పథకానికి శ్రీకారం చుట్టింది.ఇప్పటి వరకు పలు నెట్ వర్క్ లు ఎంతో కొంత చెల్లిస్తే సెల్ ఫోన్ తో  రాత్రి వేళలో నాన్ స్టాప్ గా  ఉచితంగా మాట్లాడుకునే అవకాశం ఇస్తున్నాయి. కాని  BSNL మరో అడుగు ముందుకేసి వాటిని మించిన పథకాన్ని స్టార్ట్ చేయబోతోంది..

మే 1 రాత్రి పూట నుంచి  BSNL ల్యాండ్‌లైన్ తో దేశంలోని ఏ ఫోన్ కి కాల్ చేసినా ఇక ఉచితమేనని సంస్థ ప్రకటించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల పైసా ఖర్చు లేకుండా నాన్ స్టాప్ గా మాట్లాడుకోవచ్చు. మొబైల్ ఫోన్ కస్లమర్ల విషయంలో ఎప్పటి నుంచో వెనుకబడ్డ BSNL..ల్యాండ్ లైన్ల విషయంలో మాత్రం మిగతా కంపెనీలన్నింటి కంటే ముందంజలో ఉంది. అయితే ఇటీవల ప్రైవేట్ ఆపరేటర్లు కొత్త స్కీములతో వినియోగదారులని అట్రాక్ట్ చేస్తుండటంతో..  రోజు రోజుకి BSNL ల్యాండ్ లైన్ కస్టమర్లు తగ్గిపోతున్నారు. దీంతో తీవ్రంగా ఆలోచించిన సంస్థ ఈ మేరకు ఈ కొత్త ఆఫర్ ని ప్రకటించింది.. 6 నెలల వరకు ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది.. ఆ తర్వాత రెస్పాన్స్ బట్టి కొనసాగిస్తారు..

పూర్వవైభవం కోసం పాకులాడుతున్నBSNL కి.. ఈ కొత్త ప్రయత్నాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూడాలి..