పద్మ అవార్డులు: అద్వాని, అమితాబ్, కోట శ్రీనివాసరావు, మిథాలిరాజ్,బిల్‌గేట్స్

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన పద్మ అవార్డులను ప్రకటించింది. 9 మందికి పద్మవిభూషణ్, 20 మందికి పద్మభూషణ్, 75 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా వీరికి వీరికి అవార్డులు అందజేస్తారు. పద్మ అవార్డులకు ఎంపికైన ప్రముఖుల వివరాలు ఇలా ఉన్నాయి.

పద్మవిభూషణ్:
ఎల్‌కే.అద్వానీ(బీజేపీ అగ్రనేత), అమితాబచ్చన్(బాలీవుడ్ నటుడు), ప్రకాష్‌సింగ్ బాదల్(రాజకీయనటుడు), దిలీప్‌కుమార్(బాలీవుడ్ నటుడు)

పద్మభూషణ్:
సుభాష్ సి కశ్యప్(రాజ్యాంగ నిపుణుడు), మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ దంపతులు, ఎన్.గోపాలస్వామి(మాజీ సీఈసీ)

పద్మశ్రీ:
డాక్టర్ నోరీ దత్తాత్రేయ నాయుడు(క్యాన్సర్ వ్యాధి నిపుణులు)
డాక్టర్ రఘురాం(క్యాన్సర్ వ్యాధి నిపుణులు)
కోట శ్రీనివాసరావు(నటుడు-ఏపీ)
డాక్టర్ అనగాని మంజుల(వైద్యరంగం-తెలంగాణ)
మిథాలీరాజ్(ఇండియన్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్)
పీవీ సింధు(మహిళల బ్యాడ్మింటన్ క్రీడాకారిణి)
సంజయ్ లీలా బన్సాలీ(బాలీవుడ్ సినిమా డైరెక్టర్)