బాబుకు ప‌ద‌వీ గండం ఉందా?

అప్పుడెప్పుడో ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప‌ద‌వీ గండం త‌ప్ప‌ద‌ని సిద్ధాంతులు తేల్చేశారు. కానీ ప‌ట్టించుకుంటేనా! అదంతా ట్రాష్ అని కొట్టిపారేశారు. ఏప్రిల్ 4న ఏర్ప‌డ్డ చంద్ర‌గ్ర‌హ‌ణ ప్ర‌భావం బాబుపై క‌చ్చితంగా ఉంటుంద‌ని విజయ‌వాడ‌కు చెందిన చంద్ర‌శేఖ‌ర సిద్ధాంతి తేల్చేశారు. చంద్ర‌బాబుది హ‌స్తా న‌క్ష‌త్రం, క‌న్యారాశి గ‌నుక గ్ర‌హ‌ణ ప్ర‌భావం మెండ‌ని, దీనివ‌ల‌న ప‌ద‌వీ గండం త‌ప్ప‌ద‌ని చెప్పారు.

గండం నుంచి గ‌ట్టెక్కాలంటే స‌ర‌స్వ‌తీనదిలో స్నాన‌మాచ‌రించాల‌ని, లేకా పోతే ఏదో ఒక న‌దీ తీరం చెంత వ‌రుణ సూక్తాలు ప‌ఠించాల‌ని సూచించారు. ఇవ‌న్నీ కొట్టిపారేసిన టీడీపీ బాస్ ఇప్పుడు సంక‌ట స్థితి ఎదుర‌య్యే స‌రికి త‌న త‌ప్పు తాను తెల్సుకుని చెంప‌లేసుకుంటున్నారు. మొత్తంగా సిద్ధాంతి గారి జోస్యం ఫ‌లించిందో లేదో తేలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే!