భారి అంచనాలతో రేపు గ్రాండ్ గా విడుదల అవుతున్న ‘’చీకటిగదిలో చితక్కొట్టుడు’’ సినిమా

భారి అంచనాలతో రేపు గ్రాండ్ గా విడుదల అవుతున్న ‘’చీకటిగదిలో చితక్కొట్టుడు’’ సినిమా.
“చీకటిగదిలో చితక్కొట్టుడు” ఇప్పుడు యూత్ లో ఈ సినిమా మీద ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఏప్పుడేప్పుడు విడుదల అవుతుందా అని ఇంతకాలం ఏదురుచూసిన అడల్ట్ కంటెంట్ లవర్స్ కి ఈ సినిమా మార్చి 21న అనగా హోళీ రోజు విడుదల అనేది, హోళీ పండుగ కంటే పెద్ద పండుగ లా మారింది. అంతలా యూత్ కి నచ్చాయి ఈ సినిమా టిజర్, ట్రైలర్, సాంగ్స్, ప్రోమోస్. పూర్తి స్థాయి అడల్ట్, హర్రర్ కామెడీ తో తెరకెక్కి తమిళ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగు వెర్సన్ లో హీరో హీరోయిన్ లుగా అధిత్, నిక్కి లు నటిస్తున్నారు. ప్రధాన తారాగణంగా మిర్చి హేమంత్, రఘు బాబు, పోసాని, తాగుబోతు రమేష్, సత్యం రాజేష్, నటిస్తున్న ఈ సినిమాకు సంతోష్ పి జయ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యువత లో, సిని ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచిన ఈ అడల్ట్ కంటెంట్ సినిమా మార్చి 21 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. మరీ ఈ రేంజ్ అంచనాలతో విడుదల అవుతున్న ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం.