కోటి మందికి పైగా డిజిటల్ వ్యూస్. తెలుగు ఇండస్ట్రీలో తమిళ్ డబ్బింగ్ సినిమా సరికొత్త రికార్డ్

కోటి మందికి పైగా డిజిటల్ వ్యూస్. తెలుగు ఇండస్ట్రీలో తమిళ్ డబ్బింగ్ సినిమా సరికొత్త రికార్డ్.
“చీకటిగదిలో చితక్కొట్టుడు” ఇప్పుడు ఏక్కడ విన్నా, ఏ ఛానల్ చూసినా అంతా మొన్న విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్ గురించే. తెలుగు సినిమా ప్రేక్షకులను అంతలా ఆకట్టుకుంది ఈ ట్రైలర్. సోషల్ మీడియా లో అప్లోడ్ చేసిన కొద్ది రోజుల్లోనే కోటి మందికి పైగా చూసిన ట్రైలర్ గా రికార్డ్ సాధించింది. తమిళ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగు వెర్సన్ లో హీరో హీరోయిన్ లుగా అధిత్, నిక్కి లు నటిస్తున్నారు. ప్రధాన తారాగణంగా మిర్చి హేమంత్, రఘు బాబు, పోసాని, తాగుబోతు రమేష్, సత్యం రాజేష్, నటిస్తున్న ఈ సినిమాకు సంతోష్ పి జయ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒక్క ట్రైలర్ క్రేజే తోనే యూత్ మరియు సిని ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచిన ఈ అడల్ట్ కంటెంట్ సినిమా మార్చి 21 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.