ఛెర్రీ-శ్రీను వైట్ల మూవీ టైటిల్… సెటైరికల్ స్టైల్లో

గోవిందుడు అందరివాడేలే సినిమా తర్వాత రాంచరణ్ తేజ్ మరో సినిమాకు సైన్ చేయలేదు. ఛెర్రీ తన నెక్ట్స్ సినిమా కోసం దాదాపుగా ఆరు నెలలుగా వెయిట్ చేస్తున్నాడు. పలువురు దర్శకులు కథలు చెప్పినా చివరకు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు పల్లిబఠాని.కామ్ ద్వారా ఇది వరకే తెలియజేశాం. ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్లే ఈ సినిమాకు మై నేమ్ ఈజ్ రాజు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు మాస్ ప్రేక్షకులకు నచ్చేలా శ్రీను వైట్ల స్టైల్లో సెటైరికల్ మూవీగా ఈ సినిమా స్టోరీ తయారు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాలో నటించే హీరోయిన్‌తో పాటు ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. ఈ నెలాఖరకు సినిమా పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

ఇప్పటి వరకు కేవలం యాక్షన్ సినిమాలే చేసిన ఛెర్రీ, ఇప్పుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో నటిస్తుండడంతో ఛెర్రీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కామెడీ బాగా పండించే శ్రీను వైట్ల తమ అభిమాన హీరో ఛెర్రీని కొత్తగా ప్రజెంట్ చేస్తాడని వారు ఆశిస్తున్నారు.

cherry srinu vaitla movie title