చిరు 150వ సినిమాలో క్యాన్సర్ బాలుడు బాలు….కన్‌ఫామ్ చేసిన మెగాస్టార్

త్వరలో ప్రారంభమయ్యే మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాలో క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలు అనే చిన్నారి నటించే అవకాశం ఉందని కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి తెలిపారు. గురువారం ఆయన ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిని సందర్శించి క్యాన్సర్‌తో బాధపడుతున్న పలువురు చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. తర్వాత ఆయన మాట్లాడుతూ తన 150వ సినిమా త్వరలోనే ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ సినిమాలో క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలు అనే చిన్నారి నటించే అవకాశం ఉందని తెలిపారు. 

ఇటీవల టాలీవుడ్ హీరోలు క్యాన్సర్ బాధితులను పరామర్శించడంతో పాటు వారితో కాసేపు గడుపుతున్నారు. ఇటీవల శ్రీజ అనే క్యాన్సర్ బాధిత బాలికను పరామర్శించేందుకు పవన్‌కళ్యాణ్ ఖమ్మం వెళ్లారు. ఇక మహేష్‌బాబు కూడా ఇటీవల క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారులతో కాసేపు గడిపారు. ఇప్పుడు మెగాస్టార్ కూడా క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారులతో గడిపి వారిలో మానసికోల్లాసం కలిగించారు.