చిరు 151, 152 సినిమాల డైరెక్ట‌ర్లు ఫిక్స్‌

వెండితెర మెగాస్టార్ రీ ఎంట్రీలో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాడు. దాదాపు ద‌శాబ్దం పాటు వెండితెర‌కు దూరంగా ఉన్నా యంగ్ లుక్‌లో యంగ్ హీరోల‌కే షాక్ ఇచ్చేలా ఉన్నాడు. చిరు కేరీర్‌లో ల్యాండ్ మార్క్ మూవీగా తెర‌కెక్కుతున్న ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా త‌ర్వాత చిరు వ‌రుస‌గా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టే క‌నిపిస్తోంది.

చిరు 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150 సెట్స్‌మీద ఉండ‌గానే ఆయన చేయబోయే 151, 152 సినిమాలపై కూడా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ 151వ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఆయ‌న బావ‌మ‌రిది, అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ నిర్మిస్తార‌ని, ఈ సినిమాకు మాస్ అండ్ యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడ‌ని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా త‌ర్వాత చిరు న‌టించే 152వ సినిమా కూడా ఖ‌రారైన‌ట్టే ఇండ‌స్ట్రీలో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇటీవల చిరంజీవితో త్వరలో సినిమా నిర్మిస్తానంటూ మెగా ప్రొడ్యూసర్, వైజ‌యంతీ మూవీస్ అధినేత చ‌ల‌సాని అశ్వ‌నీద‌త్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

అశ్వ‌నీద‌త్ నిర్మించే సినిమా చిరు 152వ సినిమా అన్న టాక్ వ‌స్తోంది. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్‌తో సినిమాకు స్క్రిఫ్ట్ రెడీ చేస్తోన్న త్రివిక్ర‌మ్‌, ఆ సినిమా త‌ర్వాత మ‌హేష్ 25వ సినిమాను డైరెక్ట్ చేసి చిరు సినిమాకు రెడీ అవుతాడ‌ని తెలుస్తోంది. మ‌రి త‌మ్ముడు ప‌వ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడైన త్రివిక్ర‌మ్ అన్న చిరుకు ఏ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి.