చూసీ చూడంగానే మూవీ రివ్యూ

న్యూ ఏజ్ ప్రేమ కథలకు ఇప్పుడు హెవీ డిమాండ్. నాచురల్ గా సాగే కథ, కథనం ప్రేక్షకుల్ని కట్టి పడేస్తున్నాయి. ప్యూర్ లవ్ స్టోరీస్ ని ఇష్టపడుతున్న టైంలో వచ్చిన చిచిత్రం చూసీ చూడంగానే. పెళ్లి చూపులు చిత్రంతో అందరికీ చేరువైన నిర్మాత రాజ్ కందుకూరి నిర్మాత మాత్రమే కాదు. ఆయన తనయుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేశాడు. వర్ష బొల్లమ్మ హీరోయిన్. శేష సింధు రావు ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయ్యింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని కట్టిపడేసిందా లేదా చూద్దాం.

కథేంటంటే :

సిద్ధూ (శివ) తన మదర్ (పవిత్రా లోకేష్) కారణంగా తనకు నచ్చినట్టు ఉండలేకపోతాడు. చదువు కూడా మదర్ చెప్పిందే చదువుతూ తానూ కోరుకున్నట్టు జీవితాన్ని ప్లాన్ చేసుకోలేకపోతాడు. అలా తనకు ఇష్టం లేకుండానే బి.టెక్ లో జాయిన్ అవుతాడు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం కాలేజీలో ఐశ్వర్య (మాళవికా సతీశన్)తో ప్రేమలో పడతాడు. అలా నాలుగేళ్లు ప్రేమించుకున్నాక ఐశ్వర్య సిద్ధూకి బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. ఆ తరువాత మూడేళ్లు గడిచాక సిద్ధూ చివరికి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ గా లైఫ్ ని లీడ్ చేస్తోన్న క్రమంలో అతని జీవితంలోకి శ్రుతి రావ్ (వర్ష బొల్లమ్మ) వస్తోంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ ఒకరికి ఒక్కరూ చెప్పుకునే ప్రొసెస్ లో సిద్ధూకి శ్రుతి గురించి ఒక నిజం తెలుస్తోంది. ఆమె కాలేజీ నుండే తనని ప్రేమిస్తోందని తెలుసుకుంటాడు. తనని ప్రేమిస్తోన్నా శ్రుతి ఆ విషయం సిద్ధూకి ఎందుకు చెప్పదు ? శ్రుతికి ఐశ్వర్యకి మధ్య రిలేషన్ ఏమిటి ? వారి మధ్య సిద్ధూకి సంబంధించి జరిగిన గొడవ ఏమిటి ?చివరకి సిద్ధూ – శ్రుతి ఎలా ఒక్కటి అవుతారు ? ఈ మధ్యలో వారిద్దరి ప్రేమ కథలో చోటు చేసుకున్న అంశాలు ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

సమీక్ష

చాలా సింపుల్ గా సాగ కథ, కథనం ఇది. ట్విస్టులు పెద్దగా లేకుండా రన్ అవుతుంది. పాత్రల్ని పరిచయం చేసే విధానం కొత్తగా అనిపిస్తుంది. సన్నివేశాలా చాలా సహజంగా ఉంటాయి.
ప్రేమ, ఇష్టం లాంటి ఫీలింగ్స్ ని దర్శకురాలు బాగా ఎస్టాబ్లిష్ చేసింది. కాలేజ్ సీన్స్ సరదాగా సాగుతాయి. పాటలు కూడా పెట్టినట్టుగా కాకుండా కథలో అంతర్లీనంగా వచ్చేవే. ఫీల్ గుడ్ లవ్ సాంగ్స్ కావడంతో హాయిగా వెళ్లిపోతాయి. ఫస్టాఫ్ సరదాగా సాగుతుంది. రెండో సగం ఎమోషనల్ గా సాగే కథనం ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. క్లైమాక్స్ పార్ట్ ని చాలా కన్విన్సింగ్ గా రాసుకుంది. హీరో శివ కందుకూరి ఫస్ట్ సినిమా అయినప్పటికీ నటనలో మంచి ప్రతిభ చూపించాడు. లుక్స్ పరంగానే మంచి కేర్ తీసుకున్నాడు. మాళవిక డిఫరెంట్ పాత్రలో కనిపించింది. హీరోయిన్ వర్ష ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. సహజమైన నటన మెప్పిస్తుంది. పవిత్ర లోకేష్ కి అలవాటైన పాత్రే అయినా ఇన్ వాల్వ్ అయి చేసింది.

చాలా చోట్ల డీసెంట్ కామెడీతో ఎంటర్ టైన్ చేశారు. క్లైమాక్స్ తో పాటు హీరోయిన్ తో సాగే లవ్ ట్రాక్ లో, అలాగే తనకు తన తల్లి పాత్రకి మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశంలో కూడా ఎంతో అనుభవం ఉన్న నటుడిలా శివ నటించాడు. దర్శకురాలు శేష్ సింధూ రావ్ రాసుకున్న లవ్ సీన్స్ తో పాటు కొన్ని కామెడీ డైలాగ్స్ కూడా బాగున్నాయి. అలాగే మెయిన్ గా.. హీరో -హీరోయిన్ క్యారెక్టర్ల చుట్టూ అల్లుకున్న డ్రామా కూడా బాగుంది. ఇక సినిమాలో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. సినిమా ఇంట్రస్టింగ్ గానే మొదలై ఎమోషనల్ గా ముగిసింది. ముఖ్యంగా పాత్రల మధ్య జరిగే సన్నివేశాలు చాలా సహజంగా ఎలివేట్ చేశారు. గోపిసుందర్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. నిర్మాత రాజ్ కందుకూరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

చివరగా
చూసీ చూడంగానే సహజంగా సాగే కథ, కథనం పాత్రలతో మెప్పిస్తుంది. దర్శకురాలు శేష సింధూ రాసుకున్న పాత్రలు సహజంగా మెప్పిస్తాయి. లవ్ స్టోరీలో కొత్త ప్రజెంటేషన్ ఉంది. దీంతో ప్రేక్షకులు ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. లవ్, కామెడీ, ఎమోషన్ తో సాగే చూసీ చూడంగానే నచ్చేస్తుంది. సో గో అండ్ వాచిట్.

PB Rating : 3.25/5