క్రిస్‌గేల్ జిగేల్…డబుల్ సెంచరీతో విశ్వరూపం..వరల్డ్‌రికార్డు

వెస్టిండిస్ ఓపెనర్ క్రిస్‌గేల్ విశ్వరూపం చూపించాడు. ప్రపంచకప్ గ్రూఫ్ మ్యాచ్‌లో భాగంగా జింజాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించి డబుల్ సెంచరీ సాధించాడు. 

138 బంతుల్లో 16 సిక్సర్లు, 9 ఫోర్లతో ఈ అరుదైన ఫీట్ సాధించాడు. వన్డేల్లో ఈ ఘనత సాధించిన నాలుగో క్రికెటర్ అయ్యాడు. 146 బంతుల్లో 215 పరుగులు సాధించి ఇన్సింగ్స్ చివరి బంతికి అవుటయ్యాడు. 

ఇప్పటి వరకు వన్డేల్లో భారత ఆటగాళ్లు సచిన్, సెహ్వాగ్, రోహిత్‌శర్మ మాత్రమే డబుల్ సెంచరీలు సాధించారు. రోహిత్ శర్మ రెండు డబుల్ సెంచరీలు చేశాడు.

మరో ఎండ్‌లో మార్లిన్ శ్యామ్యూల్స్ కూడా సెంచరీ సాధించడంతో వెస్టిండిస్ 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 372 పరుగులు సాధించింది.