సినీ స్టిల్‌ ఫొటోగ్రాఫర్స్‌ నూతన కార్యవర్గం

ఈ నెల 11న (రెండవ ఆదివారం) తెలుగు సినీ స్టిల్‌ ఫొటోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు ఫెడరేషన్‌లో జరిగాయి. ప్రెసిడెంట్‌గా వెంకటేష్‌, సెక్రటరీగా భద్రం గెలుపొందారు. కొత్త జనరల్‌ బాడీ మరియు సభ్యులు ప్రమాణస్వీకారం అనంతరం సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్‌ వెంకటేష్‌, సెక్రటరీ భద్రం మాట్లాడుతూ… సినిమాటోగ్రఫీ మంత్రిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. స్టిల్‌ ఫొటోగ్రఫర్ల సమస్యలను వివరించగా ఆయన వెంటనే స్పందించి వీలైనంత త్వరలో పరిష్కరించడానికి తన సహకారాన్ని అందిస్తానని అన్నారు.

Press Note